New Rules: నవంబర్ నెలలో అమలు కానున్న సరికొత్త రూల్స్ ఇవే.?

ప్రతి నెల ప్రారంభం కాగానే కొత్త రూల్స్ ప్రారంభం అవుతూనే ఉంటాయి. ఇక వచ్చేనెల అనగా నవంబర్ లో కూడా కొన్ని

  • Written By:
  • Publish Date - October 25, 2022 / 06:10 PM IST

ప్రతి నెల ప్రారంభం కాగానే కొత్త రూల్స్ ప్రారంభం అవుతూనే ఉంటాయి. ఇక వచ్చేనెల అనగా నవంబర్ లో కూడా కొన్ని కొత్త రూల్స్ అమలు లోకి రానున్నాయి. నవంబర్ లో రానున్న కొత్త రూల్స్ సామాన్యుల జేబులకు చిల్లులు పెట్టే నియమ నిబంధనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ కొత్త రూల్స్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు చార్జీలు, అలాగే బిఎస్ఎన్ఎల్ 4g సేవలు, భారతీయ రైల్వే ఈ విధంగా కొన్ని అంశాలకు సంబంధించిన నవంబర్ లో కొత్త రూల్స్ రానున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే..

ఈ మధ్యకాలంలో గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ విధంగానే నవంబర్ నెలలో కూడా గ్యాస్ సిలిండర్ ధర పెరగవచ్చు లేదంటే తగ్గవచ్చు. లేదా స్థిరంగా కూడా ఉండవచ్చు. అలాగే ప్రముఖ టెలికాం సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ నవంబర్ నుంచి 4g సేవలను ప్రారంభించనుంది. 4g సేవలను ప్రారంభించడం కోసం కసరత్తులు కూడా చేస్తోంది. కాగా వచ్చే ఏడాది ఆగస్టు నుంచి ఈ బిఎస్ఎన్ఎల్ 5జి సేవలు అందుబాటులోకి బాగున్నాయి. అలాగే గూడ్స్ రవాణా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు తప్పనిసరి చేస్తోంది భారతీయ రైల్వే సంస్థ. అందుకు సంబంధించిన కొత్త రూల్స్ నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అన్ని రకాల వేగన్లకు ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానుంది.

ప్రకృతి వైపరీత్యాలు విపత్తుల సమయంలో మిలిటరీ ట్రాఫిక్ లో కూడా ఈ మినహాయింపు ఉంటుంది. హెచ్డిఎఫ్ సి బ్యాంక్ క్యాష్ డిపాజిట్ చార్జీలను సవరించింది. నవంబర్ నుంచి ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత ప్రతి 1000 రూపాయలకి 3.5 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ట్రాన్సాక్షన్ కు కనీసం రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. మ్యాక్స్ అడ్వాంటేజ్ కరెంట్ అకౌంట్, అసేంట్ కరెంట్ అకౌంట్, ప్రీమియం కరెంట్ అకౌంట్, రెగ్యులర్ కరెంట్ అకౌంట్, ప్రొఫెషనల్ కరెంట్ అకౌంట్, అగ్రి కరెంట్ అకౌంట్ ఇలాంటి కొన్ని అకౌంట్లకు ఈ చార్జీలు వర్తిస్తాయి. కానీ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు ఈ చార్జీల విషయంలో ఎటువంటి మార్పులు ఉండవు.