నాంపల్లి కోర్టు కాసేపటి క్రితం 14 రోజుల రిమాండ్ విధించిన అల్లు అర్జున్ కు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం బన్నీని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. మరి ఇప్పుడు బెయిల్ ఇవ్వడం తో వెనక్కు తీసుకొస్తారు కావొచ్చు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
‘పుష్ప-2’ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడాన్ని సినీ అభిమానులు, సినీ ప్రముఖులే కాదు రాజకీయ ప్రముఖులు సైతం తప్పు పడుతున్నారు.
Read Also :