Site icon HashtagU Telugu

Ola Rest Rooms: ఓలా రెస్ట్ రూమ్స్ వీడియో మీకూ వచ్చిందా..అందులో నిజమెంత?

Ola Rest Rooms

Ola Rest Rooms

Ola Rest Rooms: ఓలా క్యాబ్ సంస్థ త్వరలో భారత దేశంలో మొబైల్‌ టాయ్‌లెట్లను ప్రారంభించనున్నట్లు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోను వదిలింది. ‘ఓలా రెస్ట్ రూమ్స్’ గురించి నెట్టింట వీడియో వైరల్ అవుతోంది. మొబైల్ టాయ్‌లెట్ క్యాబుల సదుపాయాల గురించి వివరిస్తూ ఆ వీడియో ఉంది. అయితే అది నిజమని అందరూ నమ్ముతున్నారు. మరి కొందరు అది ఫేక్ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం వెతకగా ఓ యూట్యూబర్ 2019లో ఓ వీడియోను పోస్టు చేసినట్లు తేలింది. 2019 ఏప్రిల్ ఫూల్ డే సందర్భంగా ఓలా సంస్థ పబ్లిష్ చేసిన ప్రాంక్ వీడియో అంటూ ఓ యూజర్ ఆ వీడియోను షేర్ చేయాగా ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో గురించి వెతకగా ఓలా 29 మార్చి 2019వ తేదిన తమ యూట్యూబ్ ఛానెల్లో ఈ వీడియోను పబ్లిష్ చేసినట్లుగా వెల్లడించింది. ‘ఓలా రెస్ట్‌రూమ్స్’ అనే కొత్త సదుపాయాన్ని యూజర్లకు అందిస్తున్నామంటూ ఓలా ఆ వీడియోను షేర్ చేసింది.

అయితే, 02 ఏప్రిల్ 2019 నాడు పబ్లిష్ చేసిన మరో వీడియోలో కూడా ఓలా సంస్థ, ఇదివరకు తాము ‘ఓలా రెస్ట్‌రూమ్స్’ పేరుతో పబ్లిష్ చేసిన వీడియో ఒక ప్రాంక్ వీడియో అని, ‘ఓలా రెస్ట్‌రూమ్స్’ నిజం కాకపోవచ్చని వెల్లడించింది. ఓలా పోస్టు చేసిన ఈ ప్రాంక్ వీడియోకి సంబంధించి పలు వార్తా సంస్థలు 2019లో కథనాలను కూడా పబ్లిష్ చేయగా అవన్నీ ప్రాంక్ వీడియోలని తేలింది. అప్పుడు పోస్టు చేసిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతూ ట్రెండింగ్ లో ఉన్నాయి.