Libia: లిబియాలో నరకం చూసిన హర్యానా యువకులు.. టాయిలెట్ నీళ్ళే గతి అంటూ?

మాములుగా డబ్బు సంపాదించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కోరికతో కొందరు రాష్ట్రాలు, దేశాలు దాటి వెళ్తుంటారు. అలా హరియాణా, పంజాబ్‌కు

  • Written By:
  • Publish Date - August 23, 2023 / 03:40 PM IST

మాములుగా డబ్బు సంపాదించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కోరికతో కొందరు రాష్ట్రాలు, దేశాలు దాటి వెళ్తుంటారు. అలా హరియాణా, పంజాబ్‌కు చెందిన యువత కూడా ఇటలీకి తరలివెళ్తూ ఉంటారు. అక్కడ వారికీ ఊహించని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. జైళ్లలో మగ్గిపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. ఇటువంటి నరకాన్ని చూసిన హర్యానాకు చెందిన ఇద్దరు యువకులు ఆరు నెలల అనంతరం భారత్‌ లోని తమ ఇంటికి తిరిగివచ్చారు. ఇక్కడికి చేరుకోగానే వారు తాము లిబియాలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఢిల్లీలో మీడియా ముందు వెళ్లగక్కారు.

ఒక ఏజెంట్‌ తమను ఇటలీ పంపిస్తామని చెప్పి రూ. 13 లక్షలు తీసుకుని లిబియాకు పంపించాడని, అయితే కొన్నాళ్లు లిబియాలో పనిచేశాక ఇటలీ పంపిస్తామని అ ఏజెంట్‌ నమ్మబలికాడన్నారు. అయితే తమకు లిబియాలో ఎవరికో అమ్మివేశాడని వారు తెలిపారు. వారు మాతో అన్నిరకాల పనులు చేయించారు. తరువాత ఏవో ఆరోపణలతో తమను జైలుకు కూడా పంపించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లిబియా జైలులో రెండుమూడు రోజుల పాటు ఎటువంటి ఆహారం ఇచ్చేవారు కాదని,తాము చనిపోకుండా ఉండేందుకు టాయిలెట్‌ నీటిని అందించేవారని అన్నారు.

కేవలం వారు మాత్రమే కాకుండా లిబియాలో వారి లాంటి వారు చాలా మంది ఉన్నారని, వారంతా భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన వారని వారు తెలిపారు. లిబియా జైలులో నరకం చూసాము. కానీ మాలో ఒకరి దగ్గర ఫోన్‌ ఉండడంతో ఆ ఫోను సహాయంతో రహస్యంగా భారత ఎంబసీకి ఫోన్‌ చేసి, తమ గోడు వెళ్లబోసుకున్నాము అని వారు తెలిపారు. ఎట్టకేలకు తమ ప్రయత్నాలు ఫలించి భారత ఎంబసీ సాయంతో 6 నెలల అనంతరం భారత్‌కు చేరుకోగలిగామని అన్నారు.