Site icon HashtagU Telugu

Body Parts Sale : బాడీ పార్ట్స్ దొంగిలించి అమ్మేశాడు..మార్చురీ మేనేజర్ నిర్వాకం

Body Parts Sale

Body Parts Sale

Body Parts Sale : కక్కుర్తి అంటే ఇదే.. 

మార్చురీలోని మృతదేహాల శరీర భాగాలను కూడా దొంగిలించి అమ్మేశారు.. 

డెడ్ బాడీల తలలు, మెదళ్ళు, చర్మం, ఎముకలకు రేటు కట్టి సేల్ చేశారు. 

పోస్టల్ పార్సిల్ ద్వారా బాడీ పార్ట్స్ ను అవసరమైన వాళ్లకు డెలివరీ చేశారు. 

అది హార్వర్డ్ మెడికల్ స్కూల్.. అమెరికాలోని బోస్టన్ సిటీలో ఉంది. ఈ విఖ్యాత మెడికల్ స్కూల్.. రీసెర్చ్ లకు కేరాఫ్ అడ్రస్. ఆదర్శ భావాలు కలిగిన ఎంతోమంది తమ డెడ్ బాడీస్ ను  ప్రయోగాల కోసం హార్వర్డ్ మెడికల్ స్కూల్ కు  విరాళంగా అందిస్తుంటారు. ఇలా వచ్చిన డెడ్ బాడీస్ లోని అన్ని పార్ట్స్ ను వేరు చేసి.. ప్రత్యేక రసాయన లేపనాల సాయంతో స్టోర్ చేస్తారు. వాటిపై రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. మెడికల్  స్టూడెంట్స్ కు టీచింగ్ చేసేటప్పుడు వీటిని ఉపయోగిస్తారు. అయితే ఈ మెడికల్ స్కూల్ కు విరాళంగా వచ్చే డెడ్ బాడీస్ ని ఉంచడానికి ఒక మార్చురీ ఉంది.

Also read : Skulls: య్యేళ్ల క్రితం పూర్వీకుల పుర్రెలకు రంగులు వేసేవారట.. ఎందుకలా చేసేవారో తెలిసిపోయింది..

తలలు, మెదళ్ళు, చర్మం, ఎముకలను దొంగిలించి..

హార్వర్డ్ మెడికల్ స్కూల్ మార్చురీకి మేనేజర్ గా వ్యవహరించే  సెడ్రిక్ లాడ్జ్ బాధ్యతను మరిచాడు. మృతదేహాల నుంచి తలలు, మెదళ్ళు, చర్మం, ఎముకలను సెడ్రిక్ లాడ్జ్ దొంగిలించి ఇంటికి తీసుకెళ్లి దాచేవాడు. అనంతరం మనుషుల  బాడీ పార్ట్స్ ను కొనే మెడికల్ మాఫియా ముఠాలను ఫోన్ లో కాంటాక్ట్ చేసే వాడు. వాళ్లతో రేటు మాట్లాడుకొని అమ్మేసేవాడు(Body Parts Sale).. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో .. శరీర అవయవాలు దానం చేయడానికి దాతలు రెడీగా ఉన్నారని సెడ్రిక్ లాడ్జ్ పోస్ట్ లు పెట్టేవాడు. అక్కడి నుంచి ఎవరైనా సంప్రదిస్తే.. అమ్మేసేవాడు.  ఒక్కో బాడీ పార్టీ ను లక్ష రూపాయలకు సెడ్రిక్ లాడ్జ్ అమ్మేవాడని మీడియాలో కథనాలు వచ్చాయి.

Also read : Sex With Dead body : డెడ్ బాడీపై లైంగిక వేధింపులకు.. శిక్ష వేసే చట్టాల్లేవ్!

15 సంవత్సరాల జైలు శిక్ష పడే ఛాన్స్ 

మనుషుల బాడీ  పార్ట్స్ ను పెన్సిల్వేనియా, మసాచుసెట్స్‌ల లో అమ్మాడని పోలీసు  దర్యాప్తులో తేలింది.  ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ కేసులో సెడ్రిక్ లాడ్జ్ భార్య డెనిస్ కూడా నిందితురాలిగా ఉంది. సెడ్రిక్ లాడ్జ్, డెనిస్ దంపతులు అమ్మిన మనుషుల బాడీ పార్ట్స్ ను కత్రినా మాక్లీన్, జాషువా టేలర్ కొని.. వాళ్ళు మళ్ళీ ఇతరులకు అమ్ముకునే వారని దర్యాప్తులో వెల్లడైంది. నేరాలు రుజువు అయితే  ఈ నలుగురికి చెరో 15 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.