Site icon HashtagU Telugu

Harsha Sai : యువసామ్రాట్ చేసిన వ్యాఖ్యలపై హర్ష సాయి ఫైర్

Harshasai

Harshasai

హర్ష సాయి (Harsha Sai) అంటే తెలియని వారు లేరు. తెలుగు యూట్యూబర్ గా అందరికి సుపరిచితం. తన ఛానెల్ “For You Telugu” లో వినోదం, సంగీతం, సామాజిక సమస్యల గురించి వీడియోలు చేస్తూ ఉంటాడు. 2018లో ఛానెల్‌ను ప్రారంభించి ప్రస్తుతం 6.25 మిలియన్లకు పైగా ఫాలోవర్లును సంపాదించుకున్నారు. హర్ష సాయి స్వస్థలం వైజాగ్. ఎంతోమందికి ఆర్థిక సాయం చేస్తూ ఉండే ఈయన ఫై ఇటీవల అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హర్ష సాయి..బెట్టింగ్ యాప్ (Betting app) లను ప్రమోట్ చేస్తూ ఎంతోమంది అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని యూట్యూబర్ యువసామ్రాట్ రవి (Youtuber Ravi) తీవ్ర వ్యాఖ్యలు చేసారు. హర్ష సాయి సేవ ముసుగులో పేద వాళ్ళను ముంచుతున్నాడని.. బెట్టింగ్ యాప్ ల ద్వారా డబ్బు సంపాదించడానికే పేదలకు సాయం చేస్తున్నట్టు నటిస్తున్నాడని కామెంట్స్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

వాళ్లకి అలా డబ్బు సాయం చేస్తేనే సమాజంలో తనకు గుర్తింపు వస్తుందని.. క్రేజ్ తో తాను ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్ లో ఫాలోవర్స్ డబ్బులు పెడతారని.. ఆ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చుననే హర్ష సాయి ఈ ఫీల్డ్ ని ఎంచుకున్నాడని రవి ఆరోపించారు. హర్ష సాయి ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినందుకు 60 లక్షలు తీసుకున్నారని కూడా ఆరోపించారు. కాగా ఈ ఆరోపణలపై హర్ష సాయి స్పందించారు.

ఈ ఆరోపణలపై హర్ష సాయి స్పందించారు. తామేమీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం లేదని.. నాన్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ నే ప్రమోట్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. టిక్ టాక్ యాప్ ని బ్యాన్ చేశారు కదా. ఎవరైనా వాడగలుగుతున్నారా? అలానే బెట్టింగ్ యాప్స్ ని కూడా బ్యాన్ చేస్తే సమస్య ఉండదు కదా అని అన్నారు. అయినా పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేసే దానితో పోలిస్తే తాను చేసేది చాలా చిన్నదని అన్నారు. ఒకవేళ మేము బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకపోతే మాకు వచ్చే డబ్బులు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కి వెళ్ళిపోతుందని.. వాళ్ళు నాలెడ్జ్ లేకుండా, డిస్క్లైమర్ కూడా వేయకుండా ప్రమోట్ చేస్తారని.. బాధ్యత లేకుండా ఉంటారని అన్నారు. మేము అయితే జాగ్రత్తలు చెప్తామని, హెచ్చరిస్తామని అన్నారు.

Read Also : CM Chandrababu : ముఖ్యమంత్రి పెట్టుబడిదారులకు చేరువయ్యారా..?