Harish Rao : బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్.. రేవంత్ రెడ్డికి బేసిన్ల మీద లేదు..

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బేసిన్‌లపై సరిగ్గా అవగాహన లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర పరువు తీయడంలోనూ వెనకబడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Relief for Harish Rao in the High Court

Relief for Harish Rao in the High Court

Harish Rao : సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బేసిన్‌లపై సరిగ్గా అవగాహన లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర పరువు తీయడంలోనూ వెనకబడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బ్యాగులపై నాలెడ్జ్ ఉన్న రేవంత్ రెడ్డికి బేసిన్‌లపై మాత్రం లేదు. బేసిక్స్ ఏమిటో కూడా తెలియని స్థాయిలో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే తీరు రాష్ట్రానికి అవమానకరం’’ అని మండిపడ్డారు.

‘‘బనకచర్ల ఏ బేసిన్‌లో ఉందో కూడా తెలియకపోతే ఎలా? అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోమంటే అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. అఖిలపక్ష సమావేశాన్ని రాజకీయ వేదికగా మార్చారు. దేవాదుల ప్రాజెక్టులు ఎక్కడ కట్టారో కూడా తెలియని స్థితి. బూతులు మాట్లాడడమే కాకుండా, బేసిన్‌ల గురించి తెలుసుకోవడం ముఖ్యమంత్రి బాధ్యత’’ అని అన్నారు. ‘‘నల్లమల పులిబిడ్డనని చెప్పుకునే వ్యక్తికి అది ఆంధ్రాలో ఉందో, తెలంగాణలో ఉందో తెలియకపోవడం దురదృష్టకరం’’ అని హరీశ్ ఎద్దేవా చేశారు.

YS Sharmila: జగన్‌ ప్రజా సమస్యలపై పోరాటం చేయండి.. బల ప్రదర్శనలు కాదు: షర్మిల

తాను చేసిన ప్రెస్ మీట్ తర్వాతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత తేదీలతో లేఖలు విడుదల చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బనకచర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఉన్నాయంటూ హరీశ్ ఆరోపించారు. ‘‘గోదావరి నుంచి 1000 టీఎంసీలు తీసుకోమని ఎలా చెబుతారు? సీఎం ఏమీ తెలుసుకోకుండా మాట్లాడుతున్నారా? బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎలా స్పందిస్తారు?’’ అంటూ ప్రశ్నలు సంధించారు.

2020 అక్టోబర్ 2న కేంద్ర మంత్రికి అప్పటి సీఎం కేసీఆర్ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ఆ లేఖలో సముద్రంలో కలిసే 3000 టీఎంసీలలో 1950 టీఎంసీలు కావాలనేది కేసీఆర్ డిమాండ్ చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా చెబుతున్న రేవంత్ రెడ్డికి కృష్ణానదిపై కనీస అవగాహన కూడా లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ఇలాంటి మాటలు మాట్లాడినందుకు సీఎం పదవికి మాత్రమే కాదు.. ఉరి తీయాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించకపోవడమే ఈ పరిస్థితికి కారణం. కేసీఆర్ నీళ్ల కోసం జీవితాంతం పోరాడారు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఆయన పోరాటం చేసి సెక్షన్ 3ను సాధించారు’’ అని హరీశ్ స్పష్టంగా తెలిపారు.

Auto Tips : పెట్రోల్-డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా ఎలా మార్చాలో తెలుసా..?

  Last Updated: 19 Jun 2025, 06:01 PM IST