Site icon HashtagU Telugu

Harish Rao: దుబ్బాకలో చెల్లని రూపాయి, మెదక్ ఎన్నికల్లో చెల్లుతుందా

Harishrao Cbn

Harishrao Cbn

Harish Rao: నర్సాపూర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఓటమి ఎరుగని సీటు మెదక్ అని, బిఆర్ఎస్ కంచుకోటలో మరోసారి గెలుపు ఖాయమని అన్నారు. ఒకరి మతంతో మరొకరు కులంతో పోటీకి వస్తే మేము చేసిన అభివృద్ధిని చూపుతూ వస్తున్నాం, దుబ్బాక లో చెల్లని రూపాయి ఇప్పుడు మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో చెల్లుతుందా అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఒక్కసారి గెలిపిస్తే ఎందుకు గెలిపించాం అని ప్రజలు బాధ పడ్డారని, వెంకటరామ రెడ్డి జీవితం తెరిచిన పుస్తకమని, ఆయన పై దుష్ప్రచారం చేయడం సరికాదు అని, 20 ఏళ్లు సేవ చేసి ప్రజల హృదయాలు గెలిచారు అని హరీశ్ రావు అన్నారు.

‘‘భూసేకరణ ఆయన ఇంటి కోసం చేయలేదు. అలా మాట్లాడుతున్నారు. దేశంలోనే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలని నిర్మించారు. మంచి ప్యాకేజీ ఇచ్చారు. మండుటెండలో గోదావరి నీళ్ళు గల గల పారాయి. లక్షల ఎకరాల్లో పంట పండింది అంటే దాని వెనుక వెంకట్రామ రెడ్డి చెమట చుక్కలు ఉన్నాయి’’ అని హరీశ్ రావు అన్నారు.

‘‘కేసీఆర్ మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చారు. 157 ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు.
తెలంగాణపై బీజేపీకి సవతి తల్లి ప్రేమ. మొదటి దశలో తెలంగాణకు ఎందుకు బుల్లెట్ ట్రైన్ ఇవ్వలేదు. ఏం చెప్పి ఇక్కడ ఓటు అడుగుతారు బిజెపి వాళ్లు సమాధానం చెప్పాలి.
13 లక్షల కోట్లు బడా కంపెనీలకు మాఫీ చేశావు. రైతులకు మాత్రం రూపాయి మాఫీ చేయలేదు. ఎన్ని గోబెల్స్ ప్రచారం చేసిన మెదక్ ఎంపీగా వెంకటరామరెడ్డి గెలుపు ఖాయం’’ అని హరీశ్ రావు అన్నారు.