Site icon HashtagU Telugu

Harish Rao: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్ రావు ఫైర్

Mla Harish Rao

Mla Harish Rao

Harish Rao: డిల్లీలో సిఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి కుమ్ముక్కు అయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరమని అని అన్నారు. మెదక్ లో బిజెపిని బిఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సిఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో మూడు చోట్ల బిఆర్ఎస్ మెజారిటీ సాధించింది. రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో కూడా బిఆర్ఎస్ మెజారిటీ సాధించింది. రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లి లో బీజేపీ కి మెజారిటీ వచ్చింది ..రేవంతే అక్కడ బిజెపి కి కాంగ్రెస్ ఓట్లు మళ్లించారా? అంటూ మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్ లో బిజెపి ఎలా గెలిచింది.  హబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. వారంతా కలిసి బిజెపిని గెలిపించారా? కొడంగల్లో రేవంత్ రెడ్డి 32 వేల మెజారిటీతో గెలిచారు. పార్లమెంటు ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 21 వేల మెజారిటీ మాత్రమే వచ్చింది. మిగతా ఓట్లను రేవంత్ రెడ్డి బిజెపికి వేయించారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.