HariHara VeeraMallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ షెడ్యూల్ మళ్లీ వాయిదా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా 'భీమ్లా నాయక్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ తర్వాత క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న 'హరిహర వీరమల్లు' రిలీజ్ కానుంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం...

Published By: HashtagU Telugu Desk
Harirahara Imresizer

Harirahara Imresizer

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘భీమ్లా నాయక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ తర్వాత క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కానుంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం… తదుపరి షెడ్యూల్ కోసం సన్నాహాలు చేస్తోంది. పవన్ తన కెరియర్లోనే మొదటిసారిగా చారిత్రక నేపథ్యంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఎ.ఎమ్. రత్నం ‘హరిహర వీరమల్లు’ ని నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో కూడిన కథలను తెరకెక్కించడంలో దర్శకుడు క్రిష్ కి మంచి అనుభవం ఉంది. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ .. ‘మణికర్ణిక’ సినిమాలు అందుకు నిదర్శనంగా మనం చెప్పొచ్చు.

పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా… మొగల్ చక్రవర్తుల కాలంనాటి కథతో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో సెట్లు వేశారు. 60 శాతం షూటింగ్ జరుపుకున్న తర్వాత కరోనా ప్రభావం వలన చిత్రీకరణ వాయిదా వేశారు. మధ్యలో ఒకటి రెండు సార్లు మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి ట్రై చేసినా… అదీ కుదరలేదు. తాజాగా ‘భీమ్లా నాయక్’ విడుదల తర్వాత ‘హరిహర వీరమల్లు’ సినిమాపై దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ భావించారు. అలా ఈ నెల 18 నుంచి తాజా షెడ్యూల్ ను మొదలుపెట్టాలనుకున్నారు పవర్ స్టార్. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్లీ వాయిదా పడినట్టుగా సమాచారం. నెక్ట్స్ షెడ్యూల్ ను ఏప్రిల్ రెండవ వారంలో మొదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ 5 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరి పవన్ – క్రిష్ కాంబోలో వస్తున్న ఈ సినిమా… విడుదల తర్వాత ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో అనేది చూడాలి.

  Last Updated: 15 Mar 2022, 09:03 AM IST