Naveen’s Murder Case: నవీన్ హత్య కేసులో హరిహరకృష్ణ స్నేహితురాలు పాత్ర.. అసలు విషయం బయటపెట్టిన డీసీపీ?

గత కొన్ని రోజుల కిందట హైదరాబాద్ లో అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన నవీన్ హత్య కేసు ఘటన అందర్నీ కణచివేసిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Updated On - May 6, 2023 / 02:59 PM IST

Naveen’s Murder Case: గత కొన్ని రోజుల కిందట హైదరాబాద్ లో అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన నవీన్ హత్య కేసు ఘటన అందర్నీ కణచివేసిన సంగతి తెలిసిందే. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం అడ్డంగా ఉన్న ప్రాణ స్నేహితుడైన నవీన్ ను ఘోరంగా హతమార్చాడు హరిహరకృష్ణ. ఇక ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో అందర్నీ భయాందోళనకు గురిచేసింది. ఇక నేరస్థుడు హరి హరకృష్ణ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.

ఘటన గురించి తెలిసినప్పటి నుంచి.. రోజుకొక విషయాన్ని బయటకు లాగుతున్నారు పోలీసులు. ఇందులో హరి హర కృష్ణ స్నేహితురాలిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే విచారణలో తనది ఎటువంటి ప్రమేయం లేదని తెలియగా.. తాజాగా ఆ స్నేహితురాలి ప్రమేయం ఉందని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. అప్పటికే హరిహరకృష్ణ స్నేహితుడు హసన్ పాత్ర కూడా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా హరి హర కృష్ణ.. యువతి కోసమే నవీన్ ను హత్య చేసినట్లు తెలిపాడు. అంతేకాకుండా అతడు చెప్పిన వివరాల ఆధారంగా యువతిపై కూడా కేసు నమోదు అయింది. ఏ2 గా హసన్, ఏ3 గా యువతి పేర్లను చేర్చి.. ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. ఇక ఈ రోజు ఆమె మీడియా సమక్షంలో జరిగిన విషయాలను బయటపెట్టారు.

ఫిబ్రవరి 17న హరి హర కృష్ణ నవీన్ ను హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడని.. ఆ తర్వాత హత్య చేసి తల, గుండె, చేతి వేళ్ళు, మర్మంగాలను శరీరం నుంచి వేరు చేశాడని.. తర్వాత వాటిని సంచిలో వేసుకొని తన ద్విచక్రవాహనంపై బ్రాహ్మణపల్లి లో ఉన్న తన స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లాడని.. ఇక అక్కడి నుంచి హసన్ తో కలిసి అవయవాలను మన్నెగూడ పరిసరాల్లో పడేశాడు అని తెలిపారు.

ఆ తర్వాత అక్కడ నుంచి హసన్ ఇంటికి చేరుకొని దుస్తులను మార్చుకొని రాత్రి అక్కడే ఉండి.. మరుసటి రోజు 18వ తేదీన ఉదయం బి.ఎన్.రెడ్డి నగర్ లో ఉండే స్నేహితురాలి దగ్గరికి వెళ్లాడని.. ఇక ఆమెకు జరిగిన విషయం చెప్పి ఖర్చులకోసం రూ. 1500 తీసుకొని వెళ్ళిపోయాడని తెలిపారు. ఆ తర్వాత ఫోన్ లో వారిద్దరితో సంప్రదింపులు జరిపాడని.. ఇక 20వ తేదీన సాయంత్రం మరోసారి స్నేహితురాలి దగ్గరికి వెళ్లి.. ఆమెను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని.. నవీన్ ను హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లాడని తెలిపారు.

ఇక దూరం నుంచి నవీన్ మృతదేహాన్ని చూపించి.. ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద వదిలేసి అక్కడి నుంచి హరి హరికృష్ణ వెళ్ళిపోయాడని.. ఇక 21వ తేదీన హరి హర కృష్ణకు నవీన్ కుటుంబ సభ్యులు ఫోన్ చేసి ఆరా తీయడంతో వెంటనే నిజం ఎక్కడ బయటపడుతుందని భయంతో పారిపోయాడు అని సాయిశ్రీ తెలిపారు. ఆ తర్వాత ఖమ్మం, విజయవాడ, విశాఖలో తల దాచుకొని.. తిరిగి 23న వరంగల్లో తండ్రి దగ్గరికి చేరుకున్నట్లు తెలిపారు.

ఇక అప్పటికే తన కొడుకు కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తండ్రికి తెలియడంతో.. వెంటనే తండ్రి కొడుకును పోలీసులకు లొంగిపొమ్మని తెలిపాడని.. అలా 24న హరి హర కృష్ణ హైదరాబాద్ కి వచ్చి మళ్లీ తన స్నేహితుడు హాసన్ దగ్గరికి వెళ్లి.. ఆ తర్వాత ఇద్దరు కలిసి మన్నెగూడలో నవీన్ శరీర అవయవాలు పడేసిన ప్రాంతానికి వెళ్లారని తెలిపారు. ఇక వాటిని తీసుకొని మళ్ళీ హత్య చేసిన ప్రదేశానికి వెళ్లి తగలబెట్టారని.. ఆ తర్వాత స్నేహితురాలు ఇంటికి వెళ్లగా అక్కడ ఆమె తల్లిదండ్రులు లేకపోవడంతో హరి హరికృష్ణ అక్కడ స్నానం చేసి.. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు లొంగిపోయాడు అని డీసీపీ తెలిపారు.