Site icon HashtagU Telugu

Tollywood : స్క్రిప్ట్ వర్క్ లో ‘వీరమల్లు’ బిజీబిజీ

Pavan And Krish

Pavan And Krish

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే సగం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే పవన్ భీమ్లానాయక్ చివరి షెడ్యూల్ ను దాదాపుగా కంప్లీట్ కావడంతో ‘హరిహర వీరమల్లు’ ఫోకస్ చేస్తున్నాడు. అందులో భాగంగా స్క్రిప్ట్ పనుల్లో బిజీబిజీగా ఉన్నాడు. సినిమాకు సంబంధించిన కీలక విషయాలను క్రిష్ తో చర్చిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్టేడ్ ను దర్శకుడు క్రిష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ అద్భుతమైన రోజు. కొత్త సంవత్సరంలో హుషారైన షెడ్యూల్‌ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అంటూ రాసుకొచ్చారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.