Gujarat PCC: సొంత‌పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించిన గుజ‌రాత్ పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ హార్థిక్ ప‌టేల్‌..

గుజ‌రాత్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హ‌ర్దిక్ ప‌టేల్ సొంత పార్టీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

Published By: HashtagU Telugu Desk
Hardik Imresizer

Hardik Imresizer

గుజ‌రాత్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హ‌ర్దిక్ ప‌టేల్ సొంత పార్టీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. పటీదార్ల నాయకులు, ఖోడల్‌ధామ్ ట్రస్ట్ అధ్యక్షుడు నరేష్ పటేల్‌ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఆయ‌న ఆరోపించారు. బీజేపీ మంచిగా పని చేస్తుందని హ‌ర్ధిక్ ప్ర‌శంసిండం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గుజరాత్‌లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాను ప‌ని చేస్తున్నా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తనను పరిగణనలోకి తీసుకోడంలేద‌న్నారు. 2017 ఎన్నికల్లో పాటిదార్ కాంగ్రెస్‌కు మంచి విజయాన్ని అందించాడు.

ఇప్పుడు అదే పాటిదార్లను, ఖోడల్ధామ్ ట్రస్ట్ అధ్యక్షుడు నరేష్ పటేల్‌ను కాంగ్రెస్ అవమానిస్తోందని… గత రెండేళ్లలో నరేష్ పటేల్ రాజకీయాల్లోకి రావాల‌నుకుంటున్నార‌ని తెలిపారు. కానీ ఆయ‌న్ని పార్టీలోకి ఆహ్వానించ‌డానికి అధిష్టానం ఇంత సమయం ఎందుకు తీసుకుంటుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. నరేష్ పటేల్, పాటిదార్లను కాంగ్రెస్ ఎందుకు అవమానిస్తోందని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తానని, ప్రజల కోసం ఎన్నో పనులు చేయాలని హార్దిక్ పటేల్ అన్నారు. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా వెల్లడించలేదు.

  Last Updated: 14 Apr 2022, 10:12 AM IST