భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, ఆప్ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. తాను ఎంపీగా ఉన్నంత వరకు వచ్చే వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ఈ మొత్తం డబ్బుల్ని పంజాబ్ రాష్ట్రంలోని రైతుల పిల్లలకోసం ఇవ్వనున్నట్లు హార్భజన్ తెలిపారు. అంతేకాదు కాకుండా రాజ్యసభ సభ్యుడిగా దేశ అభివృద్ధికి సాధ్యమైనంతా సాయం చేస్తానని ట్వట్ చేశారు.
రైతుల కూతుళ్లు చదువుకునేందుకు…వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు ఈ విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. ఇతర మార్గాల ద్వారా సాధ్యమైనంత వరకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. దేశం కోసం ఏదైనా చేయాలని ఉందన్నారు. తనను ఎంపీగా ప్రమోట్ చేయడంలో సీఎం భగవంత్ మాన్ కీలక పాత్ర వహించారని..ఆయన అడుగడుగునా పంజాబ్ ప్రజల అభివృద్ధికోసం ఆలోచిస్తున్నారని హర్భజన్ కితాబిచ్చారు. ఇదిలా ఉండగా హర్భజన్ సింగ్ పంజాబ్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవకంగా ఎన్నికయ్యారు.