Site icon HashtagU Telugu

Pawan Kalyan: సహజ సిద్ధమైన రంగులతో హోలీ జరుపుకోవాలి: పవన్ కళ్యాణ్

Anakapalle Ticket

Anakapalle Ticket

Pawan Kalyan: హోలీ పండుగ సందర్భంగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలతో పాటు భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వసంత రుతువు అడుగిడే తరుణంలో భారతీయులందరూ ఉల్లాసంగా… ఉత్సాహంగా చేసుకొనే వేడుక హోలీ. దేశ ప్రజలందరికీ హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు. జీవితం వర్ణమయం కావాలని, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ వేడుకలో సహజ సిద్ధమైన రంగులనే వినియోగించడం శ్రేయస్కరం. ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవు. హోలీ వేడుకలను సామరస్యంగా, ఆనందంగా చేసుకోవాలని కోరుకొంటున్నాను’’ అంటూ గ్రీటింగ్స్ తెలియజేశారు.

కాగా తెలుగు రాష్ట్రాల్లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సేంద్రీయ రంగులతో హోలీ’ సంబరాల్లో యువత పెద్ద సంఖ్యల్లో పాల్గొని జోష్‌గా రెయిన్‌ డాన్స్‌లు చేశారు. రంగులను ఒకరికి ఒకరు పూసుకుంటూ, రంగునీళ్లు చల్లుకుంటూ డీజే పాట లకు నృత్యాలు చేస్తున్నారు. అయితే ఈ వేడుకల్లో చాలామంది సహజ రంగులనే వాడుతూ సంబురాలను చేసుకుంటున్నారు. తెలుగు ప్రజలకు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు పండుగ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు.