Happy Birthday PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తన 74వ పుట్టినరోజు (Happy Birthday PM Modi) జరుపుకోనున్నారు. మోదీ పుట్టినరోజు కావడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో సందడి వాతావరణం నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఒకదాని తర్వాత మరొకటిగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు పదేళ్ల పదవీ కాలంలో ఆయన తన చారిత్రాత్మక నిర్ణయాల ద్వారా ఘనమైన పేరు ప్రతిష్ఠలు పొందారు.
ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు సంబంధించి మరిచిపోలేని కొన్ని చారిత్రక ఘట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2024లో మూడోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టడం ఆయన రాజకీయ ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టం. ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నిర్ణయాత్మక అధికారాన్ని సాధించింది. నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన మొదటి కాంగ్రెసేతర నాయకుడు ప్రధాని మోదీ. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. 1962 తర్వాత మొదటిసారిగా ఒక ప్రభుత్వం రెండు పర్యాయాలు పూర్తి చేసిన తర్వాత మూడవసారి అధికారంలోకి వచ్చింది.
Also Read: Commonwealth Games 2026: గ్లాస్గోలో 2026 కామన్వెల్త్ క్రీడలు!
ఇటలీలో జరిగిన జి-7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సెల్ఫీ క్లిక్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెలోని తీసిన చిత్రంలో నేతలిద్దరూ నవ్వుతూ కనిపించారు. ఈ సందర్భంగా మెలోని ప్రధాని మోదీకి నమస్తే అంటూ స్వాగతం పలికారు. పిఎం ఆవాస్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి ప్రధాని మోదీ ఆతిథ్యం ఇస్తున్న ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన జి-20 సదస్సులో పాల్గొనేందుకు బైడెన్ భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
చంద్రయాన్ 3 మిషన్ చారిత్రాత్మక విజయం తర్వాత ప్రధాని మోదీ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్. సోమ్‌నాథ్‌ని కౌగిలించుకుంటూ వీపు తట్టారు. ఈ సమయంలో ప్రధాని మోదీ ప్రతి సంవత్సరం ఆగస్టు 23న భారత జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించారు. చంద్రునిపై ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివ-శక్తి పాయింట్ అని పేరు పెట్టారు. న్యూఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని మోదీ తమిళనాడు చారిత్రక దండమైన సెంగోల్‌ను లోక్‌సభ స్పీకర్ కుర్చీ దగ్గర ఉంచారు. ఈ సమయంలో ప్రధాని మోదీ సెంగోల్ ముందు వంగి తన చేతిలో ఉన్న పవిత్ర దండంతో తమిళనాడు పూజారుల నుండి ఆశీర్వాదం తీసుకున్నారు.
2023లో కర్ణాటకలోని బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సైట్‌ను సందర్శించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తేజస్ విమానంలో ఆకాశంలో ఎగిరిన ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఈ సందర్భంగా తేజస్‌లో ప్రయాణించడం ఒక అద్భుతమైన అనుభూతి అని ప్రధాని అన్నారు.