Site icon HashtagU Telugu

KL Rahul B’Day: బర్త్ డే బాయ్ కె.ఎల్.రాహుల్ కు వెల్లువెత్తిన విషెస్

KL Rahul

KL Rahul

భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ కె.ఎల్.రాహుల్ కు పుట్టినరోజు సందర్భంగా సోమవారం శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆయనకు బర్త్ డే విషేస్ చెప్పిన తోటి క్రికెటర్లలో విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, కుల్ దీప్ యాదవ్, చటేశ్వర్ పుజారా తదితరులు ఉన్నారు. ఈసందర్భంగా భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కె.ఎల్.రాహుల్ కు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలను చెబుతూ.. ఒక మ్యాచ్ సందర్భంగా ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న ఫోటోను తన పోస్ట్ కు ట్యాగ్ చేశారు.

బీసీసీఐ కూడా కె.ఎల్.రాహుల్ కు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. ఇషాంత్ శర్మ కూడా తాను రాహుల్ తో గతంలో దిగిన ఒక ఫోటోను ట్యాగ్ చేసి ట్విట్టర్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. కాగా, కె.ఎల్.రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో సూపర్ జైన్ట్స్ జట్టుకు కెప్టెన్ గానూ వ్యవహరిస్తున్నారు.