Sachin Tendulkar: హాఫ్ సెంచరీ కొట్టిన మాస్టర్ బ్లాస్టర్ @50

అంతర్జాతీయ క్రికెట్ చరిత్ర పుటలలో సచిన్ టెండూల్కర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. వందేళ్ల తర్వాత అప్పట్లో సచిన్ ఉండేవాడట అని చెప్పుకునే స్థాయికి ఎదిగారు

Sachin Tendulkar: అంతర్జాతీయ క్రికెట్ చరిత్ర పుటలలో సచిన్ టెండూల్కర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. వందేళ్ల తర్వాత అప్పట్లో సచిన్ ఉండేవాడట అని చెప్పుకునే స్థాయికి ఎదిగారు. సచిన్ క్రికెట్ నుంచి రిటైర్ అయి 10 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సచిన్ ప్రతి అటగాడికి ఆదర్శమే. సచిన్ టెండూల్కర్ కేవలం 16 సంవత్సరాల వయస్సులో టీమ్ ఇండియాకు అరంగేట్రం చేశాడు. 2013లో తన క్రికెట్ కెరీర్‌ గు గుడ్ బాయ్ చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 30,000 పరుగుల మార్క్‌ను చేరుకున్న ప్రపంచంలోనే మొదటి మరియు ఏకైక బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్. భారత జట్టుకు ఆడుతూ ఎన్నో రికార్డులు సృష్టించి ప్రపంచంలోనే భిన్నమైన ముద్ర వేశాడు. టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు బాదాడు. సెంచరీల్లో సెంచరీ సాధించిన ఏకైక మొనగాడు సచిన్ టెండూల్కర్. ఎవరూ ఛేదించలేని రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తోన్నాడు.

ఈ రోజు లిటిల్ స్టార్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నేటితో ఆయన 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో కుప్పలుతెప్పలుగా విషెష్ తెలియజేస్తున్నారు. క్రికెట్, రాజకీయ, సినిమా ప్రముఖులు సచిన్ కు విభిన్నంగా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక ఈ రోజు సచిన్ నెట్ వర్త్ పై సోషల్ మీడియాలో తెగ ఆరా తీస్తున్నారు. సచిన్ టెండూల్కర్ నికర విలువ దాదాపు 175 మిలియన్ డాలర్లు అంటే 1436 కోట్ల రూపాయలు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సచిన్ ప్రకటనల ద్వారా భారీగానే సంపాదిస్తున్నాడు. ఇది కాకుండా పెద్ద పెద్ద కంపెనీలు సచిన్ పై పెట్టుబడులు పెడుతున్నాయి. తన ముఖ వాల్యుని క్యాష్ ని చేసుకుంటున్నారు. బూస్ట్, అనాకాడెమీ, క్యాస్ట్రోల్ ఇండియా, బిఎమ్‌డబ్ల్యూ, లూమినస్ ఇండియా, సన్‌ఫీస్ట్, ఎంఆర్‌ఎఫ్ టైర్స్, అవివా ఇన్సూరెన్స్, పెప్సీ, అడిడాస్, బిపిఎల్, ఫిలిప్స్, స్పిన్నీ వంటి బడా కంపెనీల పేర్లలో సచిన్ కు వాటా ఉంది. అలాగే జియో సినిమా సచిన్ టెండూల్కర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా చేసింది.

సచిన్ టెండూల్కర్‌కి కార్లంటే చాలా ఇష్టమన్న విషయం తెలిసిందే. సచిన్ బాగా ఇష్టపడే కారు ఖరీదు అక్షరాల 20 కోట్లు. ప్రస్తుతం సచిన్ వద్ద ఫెరారీ 360 మోడెన్, BMW i8, BMW 7 సిరీస్, 750Li M స్పోర్ట్, నిస్సాన్ Gt-R, Audi Q7, BMW M6 గ్రాన్ కూపే ఉన్నాయి.ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మాస్టర్ సచిన్ టెండూల్కర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Read More: Sachin Tendulkar: దానిని సచిన్ వైఫల్యంగా భావించారు.. సచిన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రవిశాస్త్రి..!