V. Hanumantha Rao: సీఎం జగన్ పై హనుమంతరావు ఫైర్, జగన్ కు ప్రజలు బుద్ధి చెబుతారంటూ వ్యాఖ్యలు

V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత హనుమంత రావు శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆయన ఏపీ సీఎం జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. సొంత చెల్లెలను కామెంట్ చేస్తుంటే జగన్ మాట్లాడట్లేదని మండిప‌డ్డారు. జగన్ కు నీతి నిజాయితీ లేదని మండిప‌డ్డారు. జగన్ జైల్లో ఉన్నన్నీ రోజులు షర్మిళ రాష్ట్రం మొత్తం తిరిగి పాదయాత్ర చేసిందని గుర్తుచేశారు. షర్మిళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు కాదని […]

Published By: HashtagU Telugu Desk
Vh

Vh

V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత హనుమంత రావు శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆయన ఏపీ సీఎం జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. సొంత చెల్లెలను కామెంట్ చేస్తుంటే జగన్ మాట్లాడట్లేదని మండిప‌డ్డారు. జగన్ కు నీతి నిజాయితీ లేదని మండిప‌డ్డారు. జగన్ జైల్లో ఉన్నన్నీ రోజులు షర్మిళ రాష్ట్రం మొత్తం తిరిగి పాదయాత్ర చేసిందని గుర్తుచేశారు.

షర్మిళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు కాదని వైసీపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు. ఆమె మీద పోస్టర్లు వేస్తున్నారు.  షర్మిళ మీద పోస్టర్లు వేసిన వ్యక్తులపై జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వ‌చ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి జగన్ అన్యాయం చేసిండు కాబట్టే.. షర్మిళ న్యాయం చేయడానికి ఆంధ్ర‌ప్రదేశ్‌కు వచ్చిందన్నారు. సొంత బాబాయి బిడ్డ సునీతను చంపుతానని బెదిరిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయం రోజు రోజుకి దిగజారి పోతుందని షర్మిళ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యినప్పటి నుండి వైసీపీ నాయకులు మతి లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది.. అందుకే వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.

  Last Updated: 03 Feb 2024, 04:14 PM IST