Site icon HashtagU Telugu

Hamsa Nandini : క్యాన్స‌ర్ తో పోరాడుతున్న హంసా నందిని.. కీమోథెర‌పీ నుండి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు వెల్ల‌డి

Hamsa Nandini

Hamsa Nandini

గతంలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణను ప్రకటించిన నటి హంసా నంందిని, తాను ఇప్పుడు కీమోథెరపీ నుండి బయటపడినట్లు వెల్లడించింది. తనకు కొనసాగుతున్న క్యాన్సర్ చికిత్స గురించి సోష‌ల్ మీడియాలో అప్‌డేట్ చేసింది. తాను కీమోథెరపీని పూర్తి చేసినట్లు పేర్కొంది. హంసా నందిని తన క్యాన్సర్‌కు ఇంకా చాలా చికిత్సలు పొందుతున్నట్లు ఆమె ఫోటోను పంచుకుంది. నేను అధికారికంగా కీమో సర్వైవర్‌ని. కానీ ఇంకా పూర్తి కాలేదు, నేను ఇంకా గెలవలేదు. దీనికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చింది. ఇది శస్త్రచికిత్సలకు సమయమ‌ని ఆమె పేర్కొన్నారు. డిసెంబర్ 2021 చివరలో, నటి తన రొమ్ము క్యాన్స‌ర్ కనుగొనడం తన జీవితాన్ని తలకిందులుగా మార్చిందని వెల్లడించింది. తన తల్లి కూడా రొమ్ము క్యాన్సర్‌తో చనిపోయిందని, అందుకే ఈ వ్యాధితో పోరాడతున్నాన‌ని ఆమె తెలిపింది.