Crime : మ‌హిళా ఉద్యోగిపై హ‌న్మ‌కొండ ఎస్ఐ వేధింపులు.. కేసు న‌మోదు చేసిన పోలీసులు

హ‌న్మ‌కొండ ఎస్ఐపై లైంగింక వేధింపుల కేసు న‌మోదైంది. హన్మకొండలోని కాకతీయ యూనివర్శిటీ పోలీస్‌స్టేషన్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌

  • Written By:
  • Publish Date - January 24, 2024 / 08:49 AM IST

హ‌న్మ‌కొండ ఎస్ఐపై లైంగింక వేధింపుల కేసు న‌మోదైంది. హన్మకొండలోని కాకతీయ యూనివర్శిటీ పోలీస్‌స్టేషన్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ జి.అనిల్‌ నీటిసరఫరా విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడినట్లు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహిళా సిబ్బందిని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఎన్నికల విధుల్లో నియమించారు. మార్కెట్‌లో ఎస్‌ఐ అనిల్‌ను కూడా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. అక్క‌డ మహిళా ఉద్యోగినితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి అనిల్ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడంతోపాటు తరచూ ఆఫీసుకు వెళ్లేవాడు. ఒక రోజు.. ఎస్ఐ అనిల్ .. ఆమెను తన సోదరికి పరిచయం చేయడానికి తన ఇంటికి రమ్మ‌ని అభ్యర్థించాడు. అయితే ఇంటికి వ‌చ్చిన ఉద్యోగినితో ఎస్ఐ అనిల్ అసభ్యంగా ప్రవర్తించాడు. అక్క‌డ నుంచి ఆమె తప్పించుకోగలిగింది. అప్పటి నుండి అనిల్ ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఆమెపై తన పోలీసు అధికారాన్ని ఉపయోగిస్తానని బెదిరించాడు. దీంతో మ‌హిళా ఉద్యోగిని ఈ విష‌యాన్ని త‌న భ‌ర్త‌కు తెలిపింది. మహిళ భర్తను కూడా ఎస్‌ఐ బెదిరించాడు. దీంతో ఆ మహిళ, ఆమె భర్త సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ అనిల్‌పై ఫిర్యాదు చేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్‌పై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read:  AP CM Jagan : సంక్షేమ ప‌థ‌కాలు రావాలంటే మ‌ళ్లీ వైసీపీ రావాల‌న్న జ‌గ‌న్‌