Site icon HashtagU Telugu

AP Half day schools: వచ్చే నెల నుంచి ‘హాఫ్ డే’ స్కూల్స్

Halfday

Halfday

ఆంధ్రప్రదేశ్‌లో హాఫ్ డే స్కూల్స్ ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలకు పని దినాలు తక్కువగా ఉన్నందున విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా, పాఠశాలలు ప్రతి సంవత్సరం జూన్ 12న తిరిగి తెరవబడతాయి, అయితే 2021-22 విద్యా సంవత్సరంలో  కరోనా కారణంగా ఆగస్టు మూడోవారంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితులలో, పాఠశాలలు కొన్ని సెలవు దినాలలో పని చేయడానికి, కనీసం 180 పని దినాలు ఉండేలా క్యాలెండర్ సర్దుబాటు చేయబడింది.

అయితే సిలబస్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ నెలలో కాకుండా వచ్చే నెల మొదటి వారం నుంచి హాఫ్ డే స్కూళ్లను ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. మే మొదటి వారం నుంచి వేసవి సెలవులు ప్రకటించనున్నారు. మేలో పదో తరగతి పరీక్షలు జరగనున్నందున ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా విధులకు హాజరుకావాలన్నారు. పరీక్షలు ఆలస్యమవుతాయని, ఈ విద్యా సంవత్సరం జూలై మొదటి వారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున జూన్ నెలాఖరు వరకు సెలవులు పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు.