Site icon HashtagU Telugu

Hyderabad: బిర్యానీలో వెంట్రుకలు.. కేసు నమోదు చేసిన ఫుడ్ ఇన్ స్పెక్టర్

Hyderabad

Hyderabad

Hyderabad: హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్. దీన్ని ఆసరాగా చేసుకుని గల్లీకి పదుల సంఖ్యలో హోటల్స్ పుట్టుకొస్తున్నాయి. కస్టమర్ల సంఖ్య నానాటికి పెరుగుతుండటం, బిర్యానీ లవర్స్ హోటల్స్ కి క్యూ కడుతుండటంతో కొన్ని హోటల్స్ ఏ మాత్రం నాణ్యత పాటించకుండా క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ హోటల్ నిర్వాకం బయటపడింది. ఫలితంగా కేసు బుక్ అయింది.

ఆదివారం కావడంతో ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి బిర్యానీ కోసం ఓ హోటల్ కి వెళ్ళాడు. ఎంతో ఇష్టంగా బిర్యానీ తినాలనుకున్న సదరు వ్యక్తికి బిర్యానీ రుచి ఏ మాత్రం నచ్చలేదు. సరేలే పోనీ అని బిర్యానీ తింటుండగా బిర్యానీలో వెంట్రుకలు తారసపడ్డాయి. దీంతో షాకైన ఆ వ్యక్తి హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత సంతృప్తి చెందక ఫుడ్ ఇన్ స్పెక్టర్ కు సమాచారం అందించాడు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నిహారిక సదరు హోటల్ కు చేరుకుని హోటల్‌లోని వంటగది, టాయిలెట్లను పరిశీలించారు. కస్టమర్ ఫిర్యాదు మేరకు హోటల్‌పై కేసు నమోదు చేసి హోటల్ మేనేజర్ ఆదిత్యకు నోటీసులు ఇచ్చారు.

పదిరోజుల్లో మరోసారి హోటల్‌ను సందర్శించి పరిశీలిస్తామని, హోటల్‌ నిర్వహణలో మార్పు రాకుంటే, వినియోగదారులకు అందించే ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ హెచ్చరించారు.

Also Read: Cucumber Juice: అధిక బరువుకు చెక్ పెట్టాలంటే కీరదోస జ్యూస్ తాగాల్సిందే?