Site icon HashtagU Telugu

Hair Care: జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ పనులు అస్సలు చెయ్యకండి.. అవి ఏంటంటే?

Hair Care

Hair Care

సాధారణంగా ఆడవారు పొడవాటి జుట్టును ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ఆడవారు పొట్టిగా ఉన్న జుట్టుని ఇష్టపడుతూ ఉంటారు మరి కొంతమంది పొడవాటి జుట్టును ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం ఆడవారు పొడవాటి జుట్టుని ఇష్టపడుతూ ఉంటారు. మరి పొడవాటి జుట్టు ఉండాలి అంటే ముందు జుట్టు ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో టెన్షన్స్ వల్ల రకరకాల ఫుడ్ వల్ల జుట్టు రాలడం అన్నది పెద్ద సమస్యగా మారింది. హెయిర్ ఫాల్ వల్ల చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరి పొడవాటి జుట్టు కావాలి అన్న, హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలి అన్నా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వారానికి రెండు లేదా మూడు సార్లు తల స్నానం చేయడం మంచిదట. అయితే చాలామంది రాత్రి సమయాల్లో తలస్నానం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల జుట్టు ఆరకపోవడం ఒక ఎత్తు అయితే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. రాత్రి సమయాల్లో తలస్నానం చేయడం వల్ల జలుబు,నిద్ర పట్టకపోవడం, తలనొప్పి, అలాగే చుండ్రుకి దారి తీసే పరిస్థితులు వస్తాయట. అదేవిధంగా తల స్నానం చేసేటప్పుడు జుట్టుని కిందికి వంచి నీరు పోసి ఆ తర్వాత నీటిలో డెల్యూట్ చేసిన షాంపూ వేసి రుద్దుకోవడం ఎంతో మంచిది. అలా పది నుంచి 15 సెకండ్ల వరకు నిదానంగా చేతులతో బాగా రుద్ది ఆ తర్వాత జుట్టు మొత్తానికి షాంపూ ని అప్లై చేసిన తర్వాత నీరు పోయడం వల్ల జుట్టు కూడా బాగా క్లీన్ అవుతుందట. అదేవిధంగా తలస్నానం చేసిన తరువాత జుట్టు మొత్తాన్ని టవల్ తో అద్దడం ద్వారా తడి మొత్తం ఆరిపోతుంది.

దాంతో జుట్టు సమస్యలు ఉండవు. చాలామంది జుట్టు త్వరగా ఆరాలి అనే హెయిర్ డ్రయర్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తలస్నానం చేసిన తర్వాత వెంట్రుకలను సహజంగానే ఆరబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా సమయం ఉంటే కుదుళ్లకు సాంబ్రాణి పొగ వేసి కుదుళ్లను ఆరబెట్టుకోవడం ఇంకా మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. ఇక స్నానం చేసిన తర్వాత చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే తడిగా ఉన్నప్పుడే తల దువ్వుతూ ఉంటారు. అలా తడిగా ఉన్నప్పుడు జుట్టును దువ్వడం వల్ల జుట్టు ఎక్కువ మొత్తంలో ఊడిపోతుంది. తల స్నానం చేసిన తర్వాత వెంట్రుకలు చాలా బలహీనంగా ఉంటాయి. తల స్నానం చేసిన తర్వాత జుట్టు ఆరిన తర్వాత దువ్వెనకు వెడల్పాటి పండ్లు ఉండే దువ్వెనతో చిక్కు తీసుకోవడం వల్ల చిక్కు పడదు. అలాగే జుట్టు తడిగా ఉన్నప్పుడు జుట్టుని ముడి వేయడం,జడ వేయడం లాంటివి అస్సలు చేయకూడదు. చేయడం వల్ల జుట్టు రాలే సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంటుంది.

Exit mobile version