DGP: పోలీసుల డేటా చోరి కి పాల్పడిన హ్యాకర్ అరెస్ట్: డిజిపి రవి గుప్త

  • Written By:
  • Updated On - June 9, 2024 / 11:32 PM IST

DGP: తెలంగాణ పోలీసు కు సంబంధించిన వెబ్సైట్ల హ్యాక్ కేసులో ఒక ముఖ్యమైన పురోగతి సాధించామని తెలంగాణ రాష్ట్ర డిజిపి రవి గుప్త వెల్లడించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసు డిపార్ట్‌మెంట్ యొక్క హాక్ ఐ అప్లికేషన్ డేటాను చోరీ చేసిన హ్యాకర్‌ను అరెస్టు చేసిందని రవి గుప్త ప్రకటించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో Cr.No.9/2024 ప్రకారం జూన్ 8 , 2024 నాడు అరెస్టు జరిగిందని చెప్పారు.

TSCOP, SMS సేవలకు సంబంధించిన తదుపరి లీక్‌లతో హాక్ ఐ అప్లికేషన్‌కు సంబంధించిన డేటా చోరీను గుర్తించిన తర్వాత కేసు నమోదు చేయబడిందని డిజిపి అన్నారు. త్వరితగతిన TGCSB అధికారులు ఢిల్లీకి వెళ్లి, అక్కడ వారు చోరీ చేయబడ్డ డేటాను డబ్బు కోసం పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేసినట్లు పేర్కొన్న హ్యాకర్‌ను గుర్తించి అరెస్టు చేశారని డిజిపి శ్రీ రవి గుప్త తెలిపారు.