Site icon HashtagU Telugu

Maharashtra : లోయలో పడిన స్కూల్ బస్సు…15మంది విద్యార్థులకు తీవ్రగాయాలు..!!

road accident

road accident

మహారాష్ట్రలో ఘోరప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు లోయలో పడిన ఘటనలో 15మంది చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. మాన్ గావ్ నుంచి రాయ్ గడ్ కోట వెళ్లే రోడ్డులో ఈప్రమాదం జరిగింది. పూణేలోని జ్ఞాన్ ప్రబోధిని స్కూల్ కు చెందిన బస్సుగా గుర్తించారు. మాంగావ్ రాయ్ గఢ్ రోడ్డులోని ఘరోషి వాడి సమీపంలో బస్సు లోయలో పడినట్లు స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదంలో 15మంది విద్యార్థులకు తీవ్రగాయాలైనట్లు సమాచారం.