ఇంట్లో వంట కోసం ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ సిలిండర్ ను తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో అయితే ఒక్కొక్కరు ఇండ్లలి రెండు మూడు సిలిండర్ లు అత్యవసర పనులు కోసం వినియోగించుకుంటున్నారు. సాధారణంగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంది అంటే జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏ మాత్రం ఏ మారపాటుగా ఉన్నా కూడా ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి. అంతేకాకుండా ఇల్లు మొత్తం కుప్పకూలిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మనం ఎంత జాగ్రత్త వహించినప్పటికీ కూడా అనుకోకుండా గ్యాస్ సిలిండర్లు పేలుతూ ఉంటాయి.
ఇప్పటికే ఎన్నో ప్రదేశాలలో గ్యాస్ సిలిండర్లు పేరే కుటుంబాలు మొత్తం చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ గ్యాస్ సిలిండర్లు పేలినప్పుడు మన ఇంటి తో పాటు ఇరుగుపొరుగు ఇండ్లకు కూడా చాలా ప్రమాదం. కాగా ఇది ఇలా ఉంటే అలా అని ప్రమాదాలకు చెక్ పెట్టే క్రమంలో సరికొత్త గ్యాస్ సిలిండర్ ను ఇప్పుడు మార్కెట్లోకి తీసుకువచ్చారు. సిలిండర్ పేలుడు అన్నమాట వినిపించని రీతిలో ఈ గ్యాస్ సిలిండర్ ను బ్లాస్ట్ ప్రూఫ్ పద్ధతిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రూపొందించింది.
! బ్లాస్ట్ ప్రూఫ్ ఇండేన్ సిలెండర్ ఆవిష్కరణ !
• ఐఓసి. నూతనంగా రూపొందించిన సిలిండర్.
బ్లాస్ట్ ప్రూఫ్ ఇండేన్ సిలెండర్ (10 కి.గ్రా) ను ఈరోజు @MC_GWMC ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. @KTRTRS pic.twitter.com/9B9hO0dJ8F
— Gundu SudhaRani (@SudhaRani_Gundu) July 11, 2022
దీనిని ఇండియన్ పేరిట ఐ.ఓ.సి.ఎల్ గ్యాస్ సిలిండర్ ల పేరుతో సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రూపొందించిన ఈ కొత్త సిలిండర్ ఎటువంటి పరిస్థితులలో కూడా పేలదట. అయితే మామూలుగా మనం ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్లలో 14 కేజీల గ్యాస్ వస్తూ ఉండగా, కానీ కొత్తగా తయారు చేసిన ఈ బ్లాస్ట్ ప్రూఫ్ సిలిండర్ లో మాత్రం కేవలం 10 కేజీలు మాత్రమే గ్యాస్ వస్తుందట. అయితే ఈ సిలిండర్ ను తాజాగా సోమవారం రోజున గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి ఆవిష్కరించడం జరిగింది.