Site icon HashtagU Telugu

Andhra pradesh: వైసీపీ అంటే ‘ఏమీ చేతకాని ప్రభుత్వం’- జీవీఎల్

Template (48) Copy

Template (48) Copy

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక వైఫల్యం అనే అంశంపై ఎవరైనా అధ్యాయనం చేయాల్సి వస్తే అందుకు ఏపీనే సరైన రాష్ట్రం అని వ్యాఖ్యానించారు. తాజాగా ఓటీఎస్ పేరుతో కొత్త దోపిడీకి శ్రీకారం చుట్టారని విమర్శించారు.

కేంద్రం నిధులు ఇస్తున్నా ఉపయోగించుకోవడంలేదని వెల్లడించారు. యూపీ తర్వాత కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు అందుకుంటున్న రాష్ట్రం ఏపీనే అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైసీపీకి కొత్త అర్ధం చెప్పారు. వైసీపీ అంటే ‘ఏమీ చేతకాని ప్రభుత్వం’ అని నిర్వచించారు. వైసీపీ అసమర్థతను ప్రజలకు తెలియజేస్తామని, ఈ నెల 28న విజయవాడలో భారీ బహిరంగ సభ ఉంటుందని జీవీఎల్ తెలిపారు.