Guvvala: బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేస్తే ప్రతిదాడులు చేస్తాం

Guvvala: నాగర్ కర్నూల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,  అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు బుధవారం అచ్చంపేటలో  కౌన్సిలర్ కుటుంబాని పరామర్శించి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.  సీఎం సొంత నియోజకవర్గం అచ్చంపేటలోని బిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ వర్గీయులు అచ్చంపేట పట్టణ 2వ వార్డ్ కౌన్సిలర్ నిర్మల బాలరాజు పై, వారి ఇంటి కుటుంబ సభ్యులపై దాడి జరిగిన ఖండించకపోవడం సిగ్గుచేటు అని గువ్వల మండిపడ్డారు. ఓట్లు […]

Published By: HashtagU Telugu Desk
Guvvala

Guvvala

Guvvala: నాగర్ కర్నూల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,  అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు బుధవారం అచ్చంపేటలో  కౌన్సిలర్ కుటుంబాని పరామర్శించి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.  సీఎం సొంత నియోజకవర్గం అచ్చంపేటలోని బిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ వర్గీయులు అచ్చంపేట పట్టణ 2వ వార్డ్ కౌన్సిలర్ నిర్మల బాలరాజు పై, వారి ఇంటి కుటుంబ సభ్యులపై దాడి జరిగిన ఖండించకపోవడం సిగ్గుచేటు అని గువ్వల మండిపడ్డారు.

ఓట్లు జరిగినప్పటి నుండి ఇప్పటివరకు వంగూర్, అచ్చంపేట మండలాలలోని బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేస్తే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు.  పోలీసులు ప్రజల పక్షాన నిలవాలని ప్రభుత్వానికి వత్తాసు పలికినట్లు వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, భయభ్రాంతులకు గురిచేసిన వదిలి పెట్టేది లేదని, ఎవ్వరూ డ్యూటీ నిబంధనలు ప్రకారం వారు చేసుకుంటూ ముందుకు పోవాలని పోలీసులను హెచ్చరించారు.  దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్న చూసి చూడనట్టుగా వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటు అన్నారు.  బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వారిపై దాడులకు పాల్పడడం కాంగ్రెస్ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ నిరంకుశ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.

  Last Updated: 15 May 2024, 09:52 PM IST