Site icon HashtagU Telugu

పంజాబ్ లో ‘ఎస్కేఎం’ 117 చోట్ల పోటీ

Skm Party

Skm Party

మిష‌న్ పంజాబ్ కోసం పోరాడిన రైతు నాయ‌కుడు చారుణి పెట్టిన సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్రంలోని 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయ‌డానికి సిద్దం అయింది. ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న చారుణి త‌మ పార్టీ అభ్య‌ర్థుల గెలుపు కోసం రైతు సంఘాలు ప‌నిచేయాల‌ని పిలుపు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.హర్యానాలోని భారతీయ కిసాన్ యూనియన్ వర్గానికి నాయకత్వం వహిస్తున్న రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ చారుణి. ఆయ‌న స్థాపించిన సంయుక్త్ సంఘర్ష్ పార్టీ వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్య‌ర్థుల‌ను నిలుపుతుంద‌ని వెల్ల‌డించాడు.సంయుక్త కిసాన్ మోర్చా (SKM) 40 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక రైతుల ఆందోళనకు నాయకత్వం వహించింది. హర్యానాలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా చారుణి పోరాడాడు. రాజకీయాలను ప్రక్షాళన చేసి మంచి వ్యక్తులను ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా పార్టీని స్థాపించిన‌ట్టు చారుణి వెల్ల‌డించాడు. సంయుక్త సంఘర్ష్ పార్టీ సెక్యులర్ పార్టీగా ఉంటుందని, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందని ఎజెండాను బ‌య‌ట‌పెట్టాడు.