Site icon HashtagU Telugu

US Killings: అమెరికాలో కాల్పులు…టెక్సాస్ లో 19మంది చిన్నారులతో 22మంది మృత్యువాత.!

US Killings

US Killings

కాల్పుల మోతతో అమెరికాలోని టెక్సాస్ ఉలిక్కిపడింది. ఓ ప్రాథమిక పాఠశాలలోకి చొరబడిన 18ఏళ్ల యువకుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో  22 మంది  ప్రాణాలు కోల్పోయారు.  వీరిలో 19మంది చిన్నారులు, ఓ టీచర్ ఉన్నారు. మెక్సికన్ సరిహద్దులోని ఉవాల్దే పట్టణంలోనిరోబ్ ఎలిమెంటరీ స్కూల్ లో జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులు 11ఏళ్లలోపు వారేనని అధికారులు తెలిపారు.

దుండగుడు కాల్పులు జరిపిన స్కూల్లో 500మంది కంటే ఎక్కువే చదువుకుంటున్నట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. దుండగుడు హ్యాండ్ గన్ తో పాఠశాలలోకి చొరబడ్డాడని…అతడి వద్ద రైఫిల్ కూడా ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతమైనట్లు గవర్నర్ తెలిపారు.

అమెరికాలో 2018తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన ఘటన ఇదేనని అధికారులు చెప్పారు. ఫ్లోరిడాలోని పార్క్ ల్యాండ్ లో అప్పట్లో జరిగిన కాల్పుల్లో 14మంది హైస్కూల్ విద్యార్థులతోపాటు ముగ్గురు టీచర్లు మరణించారు. 2020లో అమెరికాల జరిగిన కాల్పుల్లో 19,350మంది ప్రాణాలు కోల్పోయారు.

Exit mobile version