అమెరికాలోని మిసిసిపీలో కాల్పుల కలకలం రేపాయి. ఓ దుండగుగు ఆరుగురిని కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. మెంఫిస్, టేనస్సీకి దక్షిణంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్కబుట్లలోని వివిధ ప్రదేశాలలో షూటర్ బాధితులను హతమార్చినట్లు తెలిపారు. మిస్సిస్సిప్పి గవర్నర్ టేట్ రీవ్స్ శు\ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, టేట్ కౌంటీలో జరిగిన వరుస కాల్పులపై తనకు వివరించినట్లు తెలిపారు. దుండగుడిని సజీవంగా అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. కాల్పులకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు అమెరికాలో కాల్పుల్లో 5,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
6 Killed : అమెరికాలో కాల్పుల కలకలం.. దుండగుడి కాల్పుల్లో ఆరుగురు మృతి

Deaths