Woman Kills Son: ‘దృశ్యం’ సినిమా స్పూర్తితో కుమారుడిని హత్య చేసిన తల్లి

‘దృశ్యం’ సినిమా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్నిఆకట్టుకుంది. అయితే ఈ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ తల్లి అతి కిరాతంగా కన్న కొడుకునే కడతేర్చింది.

Published By: HashtagU Telugu Desk
Woman Kills Son

New Web Story Copy 2023 07 03t140129.940

Woman Kills Son: ‘దృశ్యం’ సినిమా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ తల్లి అతి కిరాతంగా కన్న కొడుకునే కడతేర్చింది. తన రెండేళ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 22 ఏళ్ల మహిళను సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే విచారణలో ఆమె చెప్పిన విషయాలకు పోలీసులు విస్తుపోయారు. తాను ‘దృశ్యం’ సినిమా ద్వారా ‘స్పూర్తి’ పొందినట్టు పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు ఖంగుతిన్నారు.

జూన్ 27న తన కొడుకు కనిపించకుండా పోయాడని దిండోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆ మహిళ నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది, అయితే భర్తతో వివాదాల కారణంగా ఆమె భర్తతో విడిపోయింది. దీంతో రెండేళ్ల క్రితం పుట్టినిల్లు సూరత్‌ కి వచ్చి ఉంటుంది. అయితే ఆమెకు కొడుకు ఉండటంతో తనని ఎవరు పెళ్లిచేసుకోవడానికి ముందుకు రావట్లేదు. దీంతో కొడుకుని ఎలాగైనా వదిలించుకోవాలని డిసైడ్ అయింది. అనుకున్నట్టే కొడుకు గొంతు నులిమి చంపేసి వెనుక పెరట్లో పూడ్చిపెట్టింది. ఎవరికీ అనుమానం రాకుండా తన కొడుకుని ఎవరో కిడ్నప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక మహిళ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు స్థానిక పోలీసులు.

విచారణలో తేలింది ఏంటంటే ఆ బాలుడిని హత్య చేసింది తల్లేనని తేలింది. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. ఆమెను అరెస్ట్ చేసి విచారించగా అసలు నిజం బయటపడింది. తాను ‘దృశ్యం’ సినిమా చూసి స్ఫూర్తి పొందానని చెప్పింది. తాను క్రైమ్ థ్రిల్లర్‌లను బాగా చూసేదానినని ఆ మహిళ పోలీసుల ఎదుట అంగీకరించింది.

Read More: Ashes Series : అప్పుడు మీరేం చేసిందేంటి ?… అలాంటి గెలుపు మాకొద్దు

  Last Updated: 03 Jul 2023, 02:04 PM IST