Site icon HashtagU Telugu

IPL Match: గుజరాత్ జోరుకు చెన్నై బ్రేక్ వేస్తుందా ?

Csk Chennai Super Kings

Csk Chennai Super Kings

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఎంసీఏ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ప్రస్తుత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలుపొంది, పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ టైటాన్ స్ తో జరగనున్న మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకువెళ్లాలని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భావిస్తోంది.

ఈ క్రమంలోనే టేబుల్ టాపర్ గా ఉన్న గుజరాత్ టైటాన్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నితీష్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను ఎదుర్కొనేందుకు చెన్నై ఆటగాళ్లు నెట్స్ లో చెమటోడ్చారు. ఈ నేపథ్యంలోనే ధోని అచ్చంగా రషీద్ ఖాన్ లా బౌలింగ్ చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేయించాడు. ప్రస్తుతం ధోని స్పిన్నర్ అవతరమెత్తి బౌలింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇక ఈ రోజు మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో తలపడనున్న చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టును పరిశీలిస్తే… రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప ఓపెనర్లుగా రానుండగా , మూడో స్థానంలో మొయిన్ అలీ, మిడిలార్డర్ లో అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, లోయర్ ఆర్డర్ లో శివమ్ దూబే, ఎంఎస్ ధోని , బ్యాటింగ్ కు రానున్నారు అలాగే చెన్నై జట్టు బౌలింగ్ బాధ్యతలని డ్వేన్ బ్రావో, మహేశ్ తీక్షణ, క్రిస్ జోర్డాన్, ముఖేష్ చౌదరి మోయనున్నారు.

Exit mobile version