Site icon HashtagU Telugu

IPL 2022 Gujarat Titans: ఐపీఎల్ టైటిల్ గుజరాత్ టైటాన్స్ దే…పీటర్సన్ జోస్యం..!!

Gujarat Titans

Gujarat Titans

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ చేజిక్కించుకుంటుందని, మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు స్థిరంగా విజయాలను దక్కించుకుంటోందని చెప్పుకొచ్చారు.

గుజరాత్ టైటాన్స్ ప్రదర్శన చూస్తుంటే 2008లో షేన్ వార్న్ సారథ్యంలో టైటిల్ గెలిచిన సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఆటతీరు గుర్తుకు వచ్చిందని, ఈ ఐపీఎల్‌ సీజన్ లో తన టైటిల్ ఫేవరెట్ గా టైటాన్స్ జట్టు నిలిచిందని పీటర్సన్ చెప్పాడు. ప్రస్తుతం వారు పట్టిందల్లా బంగారం అవుతోందని, ఎనిమిది మ్యాచ్‌లలో ఏడు విజయాలు అందుకొని శనివారం జరిగే మ్యాచ్‌లో టైటాన్స్ గెలవడానికి స్పష్టమైన ఫేవరెట్‌గా ఉంది.

“నేను వారి జట్టును మొదటిసారి చూసినప్పుడు వారు టేబుల్‌లో అగ్రస్థానంలో ఉంటారని నేను ఊహించలేదు, కానీ 2008లో షేన్ వార్న్ నేతృత్వంలో రాజస్థాన్ రాయల్స్ టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు ఆ టీం అండర్ డాగ్ గా ముందుకు వచ్చింది. కానీ టైటిల్ ఎగరేసుకుపోయింది.

ఇదిలా ఉంటే IPL 2022 గెలవడానికి పీటర్సన్ GTతో పాటు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ను తన ఫేవరెట్‌గా ఎంచుకున్నాడు.”రాజస్థాన్ రాయల్స్ కూడా చాలా బాగానే ఉంది, అయితే ఢిల్లీ క్యాపిటల్స్, వారి అనుభవంతో, మొదటి నాలుగు స్థానాలకు మంచి పుష్‌ని ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. పోటీలో గెలవడానికి ఆ మూడు జట్లే నాకు ఇష్టమైనవి” అని పీటర్సన్ జోడించారు.