Cyclone Biparjoy: బిపార్జోయ్ తుపాను ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్‌లో తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ ప్రకారం జూన్ 15 సాయంత్రం నాటికి తీవ్రమైన తుఫాను బిపార్జోయ్ సౌరాష్ట్ర మరియు జఖౌ నౌకాశ్రయానికి సమీపంలో ఉన్న కచ్‌లను తాకనుంది. దీంతో ముంబైలో అలలు ఎగసిపడుతున్నాయి.
బైపార్జోయ్ తుఫాను తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. జూన్ 15న సౌరాష్ట్ర, కచ్‌లను బిపార్జోయ్ తాకనుందని వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్‌లోనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ మేరకు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుజాగ్రత్త చర్యగా ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన 21 బృందాలు, ఎస్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన 13 బృందాలను మోహరించారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వైద్య, ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం తెలిపారు. కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలను సమీక్షించిన అనంతరం ఆయన ఈ విషయం చెప్పారు.
Read More: Priyanka Chopra : తన మొదటి సినిమా సంపాదనతో ప్రియాంక చోప్రా ఏం కొన్నదో తెలుసా..?