Site icon HashtagU Telugu

Gujarat Boat Tragedy: గుజరాత్‌లో పడవ బోల్తా..ఇద్దరు ఉపాధ్యాయులతో సహా 12 మంది విద్యార్థులు మృతి

Gujarat Boat Tragedy

Gujarat Boat Tragedy

Gujarat Boat Tragedy: గుజరాత్‌‌లో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. గుజరాత్‌లోని వడోదరలో గురువారం పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న పడవ సరస్సులో బోల్తా పడింది. బోటులో విద్యార్థులతో సహా 27 మంది ఉన్నారు. సమాచారం ప్రకారం ఈ ప్రమాదం జరిగినప్పుడు పిల్లలు హర్నిలోని మోత్నాథ్ సరస్సులో బోటింగ్ చేస్తున్నారు. ఘటన అనంతరం చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివరాలు చూస్తే..

గుజరాత్‌లోని వడోదరలో సరస్సులో విద్యార్థులతో నిండిన పడవ బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు ఉపాధ్యాయులతో సహా 12 మంది విద్యార్థులు మరణించారు. బోటులో విద్యార్థులతో సహా 27 మంది ఉన్నారు. వీరంతా హర్నిలోని మోత్‌నాథ్ సరస్సులో బోటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. బోటులో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించలేదు. గత సంవత్సరం క్రితం జరిగిన మోర్బీ సస్పెన్షన్ బ్రిడ్జి ప్రమాద జ్ఞాపకాలను మరువకముందే ఇప్పుడు మరో పడవ ప్రమాదం చోటు చేసుకుంది.

బోటు బోల్తా ఘటన తర్వాత రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టింది. సెర్చ్ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 10 మంది చిన్నారులను బయటకు తీశారు.ప్రాథమిక సమాచారం ప్రకారం బోటులో దాదాపు 27 మంది ఉన్నారు. వీటిలో 23 నుంచి 24 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ విషాద ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంతాపం తెలిపారు. పడవ బోల్తా పడి చిన్నారులు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల ఆత్మకు శాంతి కలగాలని కోరారు. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. భగవంతుడు వారికి ఈ బాధను భరించే శక్తిని ప్రసాదించాలని అన్నారు.

Also Read: Masala Chai: మసాలా టీ లాభాలు, తయారు విధానం, కావాల్సిన పదార్ధాలు