Site icon HashtagU Telugu

GST : సెప్టెంబర్ నెల జీఎస్టీ వసూళ్లు ప్రకటించిన కేంద్రం..!

GST Rate Cut Off

GST Rate Cut Off

సెప్టెంబర్ నెలలో జీఎస్టీ (GST) వసూళ్ల వివరాలను కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో 1.62 లక్షల కోట్ల రూ.లు వసూలైనట్టు వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్ 1.47 లక్షల కోట్ల రూ.లు జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. ఈ ఏడాది లాస్ట్ ఇయర్ తో పోల్చితే 10 శాతం వృద్ధి కనిపిస్తుంది. ప్రతి నెల జీఎస్టీ వసూళ్లను ప్రకటిస్తుంది కేంద్రం. ఈ ఏడాది ప్రతి నెల జీఎస్టీ కలెక్షన్ వెల్లడిస్తూ వస్తున్నారు. అయితే జీఎస్టీ వసూళ్లు 1.6 లక్షల కోట్లు దాటడం ఈ ఏదాదిలోనే ఇది నాలుగోసారి.

వస్తువు దిగుమతి ఎగుమతుల మీద జీఎస్టీ (GST) వసూళ్లు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణీత పర్సెంటేజ్ ల రూపం లో జీఎస్టీ వసూళ్లు చేస్తుంటారు. అయితే నెల నెల ఈ జీఎస్టీ వసూళ్ల రేటు పెరుగుతుంది. లాస్ట్ ఇయ సెప్టెంబర్ తో చూస్తే ఈ ఏడాది 10 శాతం ఎక్కువ రావడం విశేషం.

సెప్టెంబర్ నెలలో కేంద్ర జీఎస్టీ 29,818 కోట్ల రూ.లు కాగా.. రాష్ట్ర జీఎస్టీ 37,657 కోట్ల రూ.లు వచ్చాయి. సమీకృత జీఎస్టీ 83,623 వస్తు దిగుమతుల మీద వసూలైన 41,145 కోట్ల రూ.లు కలిపుకుని వచ్చాయి. సెస్ రూపం లో కూడా 11,613 కోట్ల రూ.లు దిగుమతులపై వసూలైన 881 కోట్లను కలుపుకుని వసూలనట్టు కేంద్ర వెల్లడించింది.

Exit mobile version