టెక్సటైల్స్ పై 5 శాతం ఉన్న జీఎస్టీ ని 12 శాతానికి పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి 1 నుండి టెక్సటైల్స్ పై 12 శాతం జీఎస్టీ అమలు కావాల్సి ఉండగా ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆధ్వర్యంలో జరిగిన 46వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ పెంపు సరికాదని దేశవ్యాప్తంగా నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ పెంపును నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేనేత, మరమగ్గాల కార్మికులు, వస్త్ర వ్యాపారులు ఆందోళనకు దిగారు. పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు కల్పించేది వస్త్ర రంగమేనని.. అలాంటి రంగంపై జీఎస్టీ పెంపు సరికాదని నేత కార్మికులు, వ్యాపారులు చెబుతున్నారు.