Group 2 : గ్రూప్ 2 పరీక్షను నవంబర్ కు వాయిదా వేసిన తెలంగాణ సర్కార్

  • Written By:
  • Publish Date - August 12, 2023 / 11:54 PM IST

ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 (Group 2)పరీక్ష ను నవంబర్ కు వాయిదా వేశారు. గ్రూప్-2 పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు గురువారం నాడు టీఎస్ పీఎస్ సీ (TSPSC) కార్యాలయాన్ని ముట్టడించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అభ్యర్థుల అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ (CM KCR) గ్రూప్-2 పరీక్ష ను నవంబర్ కు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశాలు జారీ చేయడం తో..నవంబర్ కు పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఇటీవల వరుసగా పోటీ పరీక్షలు నిర్వహిస్తుండడంతో, తాము ఏ పరీక్ష కు సరిగా ప్రిపేర్ కాలేకపోతున్నామని , అభ్యర్థులు ముందు నుండి చెపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో గురువారం వేల సంఖ్యలో అభ్యర్థులు టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. వీళ్లకు విపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. అధికారులు ఎంతకూ స్పందించకపోవటంతో.. 150 మంది అభ్యర్థులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో.. విచారణ జరిపిన న్యాయస్థానం టీఎస్పీఎస్సీపై అసహనం వ్యక్తం చేసింది. కాగా.. సోమవారం రోజు తమ నిర్ణయం చెప్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఇంతలో కేసీఆర్ పరీక్షను వాయిదా వేయాలని ఆదేశించడం తో నవంబర్ కు వాయిదా పడింది.

Read Also : Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేత భారత్… ఫైనల్ లో మలేషియాపై విజయం