Site icon HashtagU Telugu

Groom Death: శోభనం గదిలో వరుడు మృతి!

Shobhanam

Shobhanam

పెళ్లి ప్రతిఒక్కరి జీవితంలో మరిచిపోలేని మధుర వేడుక. కానీ ఈ వ్యక్తి జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లై 12 గంటలు దాటకుండానే చనిపోవడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. తులసీ ప్రసాద్ ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. సోమవారం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది.

అయితే మంగళవారం రాత్రి శోభనం ఏర్పాటుచేశాడు. శోభనం గదిలోకి వెళ్లిన వ్యక్తి విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. అతను అనారోగ్యంతో చనిపోయాడా? ఏదైనా విష ప్రయోగం జరిగిందా? అనే కోణంలో బంధువులు అనుమానిస్తున్నారు. అయితే మరణంపై అనేక అనుమానాలున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు కాకపోవడం కూడా గమనించదగ్గ విషయం.