Minister Gangula: ఇళ్లులేని నిరుపేదలకు వరం గృహలక్ష్మి పథకం: మంత్రి గంగుల

స్వయంగా అర్హులను గుర్తించి మంజూరు పత్రాలను వారున్న చోటుకే వెళ్లి అందజేసి తన పెద్దమనుసును చాటుకున్నారు మంత్రి గంగుల.

  • Written By:
  • Publish Date - October 9, 2023 / 03:33 PM IST

పేదల సంక్షేమం చూడడంలో, వారికి కడుపునిండా అన్నం, కట్టుకోవడానికి మంచి బట్ట, ఉండడానికి డిగ్నిటీ ఇళ్లు అందిస్తున్న ప్రభుత్వం సీఎం కేసీఆర్ది, తెలంగాణ మాదిరి భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదు, ఇలా అభివ్రుద్ది, సంక్షేమంలో దేశానికి దిక్సూచిగా నిలుస్తుంది తెలంగాణ.
సీఎం కేసీఆర్ గారి ఆశయాలను అమలు చేయడంలో తనదైన శైలితో దూసుకుపోతారు మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, ఆద్యాత్మిక, అత్యాధునిక హంగులతో నగర జీవికి సరికొత్త ప్రపంచాన్ని చెంతకు చేరుస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకం సైతం అర్హులైన నిరుపేదలకు అందించడంలో పూర్తిగా సఫలీకృతం అయ్యారు, నగరంలో ఇళ్లులేని పేదలు ఉండకూడదనే సంకల్పంతో గృహలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్నారు. స్వయంగా అర్హులను గుర్తించి మంజూరు పత్రాలను వారున్న చోటుకే వెళ్లి అందజేసి తన పెద్దమనుసును చాటుకున్నారు మంత్రి గంగుల. తాజాగా కరీంనగర్లోని అరుందతినగర్, 22, 25, 42 తదితర డివిజన్లు, కొత్తపల్లి మండలం చింతకుంట, రూరల్ మండలం నగునూరు తదితర చోట్ల పేదలకు తనే వెల్లి గృహలక్ష్మీ మంజూరు పత్రాలను అందజేసారు. రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల మంత్రిగా తన శాఖకు సంబందించి బిసిలు, పేదలకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు కరీంనగర్లో ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతీ పథకాన్ని అత్యధిక స్థాయిలో సాధించుకొని ప్రజలకు మరింత మేలు చేయడానికి కృషి చేస్తూనే ఉన్నారు.
ఒకప్పటి కరీంనగర్కి ఇప్పటి నగరానికి తేడా స్పష్టంగా చూపించారు, కేబుల్ బ్రిడ్జి, అందమైన కూడళ్లు, సెంట్రల్ లైటింగ్, సమ్రుద్దిగా తాగునీరు, సురక్షితమైన డ్రైనేజీ వ్యవస్థ, అద్దాల్లాంటి రోడ్లు ఇలా ప్రతీ అంశంలోనూ తనదైన శైలితో నగరాన్ని రాష్ట్రంలో ఆధర్శవంతంగా నిలిపారు, ఇక మానేరు రివర్ ప్రంట్ పూర్తైతే ప్రపంచపటంలో కరీంనగర్ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఈ ప్రగతిని చూసిన ప్రతిపక్షాలు బేజారై పారిపోతుంటే, ప్రజలు మా అన్న అంటూ గంగుల కమలాకర్ని తమ ఇంటి వ్యక్తిగా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నేతలు, లబ్దీదారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.