Site icon HashtagU Telugu

TSRTC Merger Bill : ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లుకు శాసన సభ ఆమోదం

TSRTC Merger Bill approved

TSRTC Merger Bill approved

TS ఆర్టీసీ విలీన బిల్లుఫై నెలకొన్న ఉత్కఠకు తెరపడింది. అసెంబ్లీ లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay Kumar) ఆర్టీసీ విలీన బిల్లు (TSRTC Merger Bill)ను ప్రవేశ పెట్టగా.. శాసన సభ (Telangana Assembly )ఆమోదం తెలిపింది. శాసన సభ ఆమోదం తెలుపడం తో అసెంబ్లీ లో అంత హర్షం వ్యక్తం చేసారు. ఉద్యోగుల విలీనం వల్ల ప్రతి ఏటా ప్రభుత్వం ఫై రూ. 3 వేల కోట్ల భారం పడనుంది. ఆర్టీసీ ఆస్తులు కార్పొరేషన్ ఆదీనంలో ఉంటాయని మంత్రి పువ్వాడ క్లారిటీ ఇచ్చారు. అంతకు ముందు అధికారులతో చర్చలు జరిపిన తర్వాత గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. గ‌వ‌ర్న‌ర్ (Telangana Governor) అనుమ‌తితో ఆర్టీసీ విలీన బిల్లుకు అడ్డంకులు తొలిగిపోయినట్లు అయ్యింది.

టీఎస్ఆర్టీసీ విలీన బిల్లును గ‌త రెండు రోజులుగా గ‌వ‌ర్న‌ర్ పెండింగ్‌లో ఉంచ‌డంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. శనివారం రాజ్‌భ‌వ‌న్‌ ముట్టడి చేసారు. ఈ క్రమంలో గవర్నర్ ..యూనియన్ సభ్యులతో చర్చలు జరుపడం..పలు అంశాలు ప్రభుత్వాన్ని అడగడం చేసారు. దానికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలతో గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలిపారు. మరోపక్క అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించారు. దీంతో సోమ, మంగళవారాల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

Read Also : Gaddar : మూగబోయిన ఉద్యమ గళం..