‘ఈ భూమిపై రక్త సంబంధాన్ని మించింది మరొకటి లేదు’ అంటారు. రక్త సంబంధం విలువను చాటిచెప్పే ఎన్నో వీడియోలను మీరు చూసి ఉంటారు. పుట్టిన తర్వాత తొలిసారిగా.. ఆస్పత్రి నుంచి ఇంటికి ఉయ్యాలలో వచ్చిన తన మనవడిని కళ్లారా చూసుకొని.. ఓ తాత భావోద్వేగానికి గురయ్యాడు. భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. మనవడిని కౌగిలించుకొని ఆనంద పరవశంలో మునిగిపోయాడు. ఆ పక్కనే నిలబడ్డ నానమ్మ .. ఈ దృశ్యాన్ని చూసుకొని ఆనందభాశ్పాలు రాల్చింది.
ఈ దృశ్యలతో కూడిన వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. ‘ గుడ్ న్యూస్ కరెస్పాండెంట్’ అనే ఇన్స్టా పేజీలో ఈ ఉద్వేగ భరిత వీడియోను పోస్ట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం దాన్ని మీరు కూడా చూడండి..