Site icon HashtagU Telugu

Junagadh: తెలుగు పోలీస్ కి గుజరాత్ లో అరుదైన గౌరవం.. అపూర్వ రీతిలో వీడ్కోలు?

Junagadh

Junagadh

తాజాగా ఏపీలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడి కుదురు మండలానికి చెందిన వాసంశెట్టి రవితేజ పోలీసు విభాగంలో ఉన్నత అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. అలా విధులు నిర్వహిస్తూ ఎంతోమంది మన్నలను అందుకోవడంతో పాటు మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా పోలీస్ అధికారి రవితేజకు గుజరాత్ లో ఒక అరుదైన గౌరవం దక్కింది. పోలీసు అధికారి రవితేజకు జునాగడ్ అసలు ఎంతో భిన్నంగా ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు కార్యక్రమం పోలీసు సూపర్డెంట్ కార్యాలయం నుంచి ప్రారంభమయింది.

మొదట పూలతో అలంకరించిన కారులో అధికారి రవితేజను కూర్చోబెట్టారు. పోలీసు సూపర్డెంట్ కార్యాలయం నుంచి పోలీసు కాన్వాయ్ జునాగడ్ వీధుల గుండా ముందుకు సాగింది. ఈ క్రమంలోనే జునాగడ్ ప్రజలు పోలీసులు సూపర్డెంట్ కు రహదారి మార్గంలో అపూర్వ రీతిలో ఘనంగా వీడ్కోలు పలికారు. 2015 ఐపీఎస్ దాచుకు చెందిన రవితేజ జునాగడ్ ఎస్పీగా మూడేళ్లు సేవలను అందించారు. 2019లో జునాఘడ్ జిల్లాలో సూపర్డెంట్ గాని నియమితులయ్యారు రవితేజ. తాజాగా జునాగడ్ నుంచి గుజరాత్ లోని గాంధీనగర్ ఎస్పీగా బదిలీ అయ్యారు. గాంధీనగర్ ఎస్పీగా బాధ్యతలను స్వీకరించేందుకు వచ్చిన ఆయనపై స్థానికులు పూల వర్షం కురిపించారు. అపూర్వ స్వాగతం పలికారు.

రవితేజ పోలీసు విభాగంలో అందించిన సేవలకు గుర్తుగా అప్పటి డిప్యూటీ సీఎం నవీన్ పటేల్ చేతులమీదుగా ప్రశంసా పత్రాన్ని కూడా అందుకున్నారు. వారి ప్రాంతానికి చెందిన వ్యక్తి గుజరాత్ లో అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంపై కోనసీమ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు వీడియోలు చూసిన నెటిజెన్స్ రవితేజ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.