Tomatoes: రేపటి నుంచి 40 రూపాయలకే కిలో టమాటాలు.. ఎక్కడంటే..?

టమోటా (Tomatoes)ల అధిక ధరల్లో ఉపశమనం లభించనుంది. ఆదివారం అంటే 20 ఆగస్టు 2023 నుంచి కిలో రూ. 40 చొప్పున టమాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

  • Written By:
  • Publish Date - August 19, 2023 / 07:44 AM IST

Tomatoes: టమోటా (Tomatoes)ల అధిక ధరల్లో ఉపశమనం లభించనుంది. ఆదివారం అంటే 20 ఆగస్టు 2023 నుంచి కిలో రూ. 40 చొప్పున టమాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కిలో టమాటను రూ.40కి విక్రయించాలని వినియోగదారుల శాఖ ఎన్‌సీసీఎఫ్‌, నాఫెడ్‌లను కోరింది. టమాటా సరఫరాలో మెరుగుదల, హోల్‌సేల్, రిటైల్ మార్కెట్‌లో ధరలు తగ్గిన తరువాత ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎన్‌సిసిఎఫ్, నాఫెడ్‌లను కిలో రూ.40 చొప్పున విక్రయించాలని కోరింది. గతంలో ఆగస్టు 15 నుంచి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కిలో టమాటను రూ.50కి విక్రయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ కేవలం ఐదు రోజుల్లోనే ప్రభుత్వ సంస్థలు విక్రయించే టమాట ధర కిలోకు రూ.10 తగ్గింది.

జూలై 14, 2023 నుండి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో రిటైల్ మార్కెట్‌లో చౌక ధరలకు టమోటాలను విక్రయించడం ప్రారంభించామని, తద్వారా సామాన్య ప్రజలు ఖరీదైన టమోటాల నుండి ఉపశమనం పొందవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్‌లు జూలై 14 నుంచి రిటైల్ మార్కెట్‌లో 15 లక్షల కిలోల టమోటాలను కొనుగోలు చేసి విక్రయించాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కోటా, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, కాన్పూర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, బీహార్‌లోని పాట్నా, ముజఫర్‌పూర్, అర్రా, బక్సర్‌లలో టొమాటోలు చౌక ధరలకు విక్రయించబడ్డాయి.

Also Read: Richest MP – Rajya Sabha : దేశంలోనే ధనిక ఎంపీ బండి పార్థసారథి.. సెకండ్ ప్లేస్ లో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి

వాస్తవానికి అతివృష్టి కారణంగా పంట దెబ్బతినడం, సరఫరాలో సమస్యల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో టమాటా ధర కిలో రూ.250 నుంచి రూ.300 వరకు పెరిగింది. ఆ తర్వాత ఎన్‌సిసిఎఫ్, నాఫెడ్ టమోటాలను కిలో రూ.90కి విక్రయించడం ప్రారంభించాయి. 16 జూలై 2023 నుండి ధరలు కిలోకు రూ. 80కి తగ్గించబడ్డాయి. జూలై 20 నుంచి కిలో రూ.70, స్వాతంత్య్ర దినోత్సవం నుంచి రూ.50, ఇప్పుడు కిలో రూ.40కి తగ్గించాలని నిర్ణయించారు.

ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడాలో మొబైల్ వ్యాన్‌లను ఏర్పాటు చేయడం ద్వారా NCCF సాధారణ ప్రజలకు చౌక ధరలకు టమోటాలను విక్రయించింది. NCCF ఆన్‌లైన్‌లో ONDC ద్వారా చౌక ధరలకు టమోటాలను విక్రయిస్తోంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఎన్‌సీసీఎఫ్‌, నాఫెడ్‌లు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి ఈ టమోటాలను కొనుగోలు చేసి వాటి ధర ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విక్రయిస్తున్నాయి.