Nirmala Sitaraman: మధ్య తరగతి కోసం ప్రభుత్వం మరింత చేయబోతోంది: నిర్మలా సీతారామన్

త్వరలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే తరుణంలో మధ్య తరగతి ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. ఈ తరుణంలోనే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతిని ప్రస్తావిస్తూ.. ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు.

  • Written By:
  • Publish Date - January 16, 2023 / 09:59 PM IST

Nirmala Sitaraman: త్వరలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే తరుణంలో మధ్య తరగతి ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. ఈ తరుణంలోనే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతిని ప్రస్తావిస్తూ.. ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. మధ్య తరగతి కష్టాలేంటో తనకు తెలుసునని ఆమె చెప్పడం మీడియా ఛానల్స్ లో హైలెట్ అయింది. ఆరెస్సెస్ కు చెందిన పాంచజన్య మ్యాగజీన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. పలు అంశాల మీద మాట్లాడారు.

దేశంలో అధిక సంఖ్యలో ఉన్న మధ్య తరగతి కోసం మోదీ ప్రభుత్వం మరింత చేయబోతోందని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ‘నేను మధ్య తరగతి నుంచే వచ్చా. మధ్య తరగతి కష్టాలేంటో తెలుసు. ప్రస్తుత మోదీ ప్రభుత్వం మధ్య తరగతిపై ఎలాంటి కొత్త పన్నులు వేయలేదు. రూ.5లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ట్యాక్సులూ వేయలేదు’ అని నిర్మలా సీతారామన్ వివరించారు.

అటు దేశంలోని 27 నగరాల్లో మెట్రో రైలు నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తున్నామన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. 100 స్మార్ట్ సిటీలు నిర్మిస్తున్నామన్నారు. 2020 బడ్జెట్ నుండి ఏటా మూలధన వ్యయం పెంచుకుంటూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ప్రభుత్వ బ్యాంకుల పరిసస్థితి మెరుగైందని, దాదాపు బ్యాంకులకు రూ.2.11లక్షల కోట్ల మూలధ సాయం చేశామని ఆమె వివరించారు.

రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నిర్మలా సీతారామన్.. దానికి అనుగుణంగా అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాగా గతంలో దేశంలో పెరుగుతున్నధర మీద అభ్యంతరకంగా కామెంట్ చేసిన నిర్మలా సీతారామన్.. ఇప్పుడు మాత్రం మధ్య తరగతికి చెందిన వ్యక్తిని తాను అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.