Site icon HashtagU Telugu

No Salaries Yet: ఏపీలో ఇంకా అందని వేతనాలు, పెన్షన్లు

Ap Secretariat Imresizer

Ap Secretariat Imresizer

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంకా వేతనాలు, పెన్షన్లు అందలేదు. ఇప్పటివరకు సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి ఆర్ధికశాఖకు బిల్లులు చేరలేదు. నిధులు అందుబాటులో లేక ఆర్ధికశాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. కొందరికి మాత్రమే వేతనాలు, పెన్షన్లు అందాయి. ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలంకు కూడా.. రూ. 390 కోట్లు ఏపీ ప్రభుత్వం ఇండెంట్‌ పెట్టింది. ఏపీకి కొత్త అప్పులకు కేంద్ర ఆర్ధికశాఖ అనుమతి ఇవ్వలేదు. వేతనాలు, పెన్షన్ల రూపేణా రూ.6 వేల కోట్లు అవసరం ఉంది.

అందుబాటులో ఉన్న నిధులు ఆధారంగా వాయిదా పద్దతిలో వేతనాలు, పెన్షన్లు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నిన్న ఒకటో తేదీ ఆదివారం, రేపు రంజాన్‌ సెలవు, ఇక నాలుగో తేదీనే పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఏపీలో ప్రస్తుతం… ఉద్యోగుల జీతాలా? సంక్షేమ పథకాలా? ఏది ముఖ్యం అని ప్రశ్నించుకుని, ప్రాధాన్యాలు నిర్ణయించుకోవాల్సి వస్తోంది. పథకాలు అమలు చేస్తే వేతనాలు ఇవ్వలేరు. జీతాలు ఇస్తే పథకాలు అమలు చేయలేరు. రెండింటికీ ఒకేసారి నిధులు సర్దుబాటు చేయడం ఖజానాకు తలకు మించిన భారమవుతోంది.