Site icon HashtagU Telugu

Nizam College: లేడీస్ కు నిజాం కాలేజి హాస్ట‌ల్ లో 50శాతం వ‌స‌తి

Nizam College

Nizam College

కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనంలో 50 శాతం యూజీ విద్యార్థినులు, 50 శాతం పీజీ విద్యార్థినులను కేటాయించాలని నిజాం కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) అధికారులను కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ (సీఈసీ) ఆదేశించింది. ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిజాం కాలేజీ ప్రిన్సిపాల్‌ను ఆదేశిస్తూ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కళాశాలకు చెందిన మహిళా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులు గత కొన్ని రోజులుగా ఆందోళ‌న చేస్తున్నారు. కొత్త‌ వసతి గృహంలో తమకు గదులు మంజూరు చేయాలని యాజమాన్యాన్ని వేడుకున్నారు. PG విద్యార్థులకు మాత్రమే హాస్టల్ స్థలాన్ని రిజర్వ్ చేయాలని కాలేజి, ఓయూ అధికారులు నిర్ణ‌యించారు.

నిజాం కళాశాలలో చదువుతున్న 200 మంది విద్యార్థినులకు హాస్టల్‌ సౌకర్యాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌డీఎంఏ)కి అనుమతినిచ్చి ఓయూకు నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వరుస ట్వీట్లలో ఈ చర్య ‘చారిత్రం మరియు ‘మానవత్వంస తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Exit mobile version