Govt Chopper Crash: రాయ్ పూర్ లో హెలికాప్టర్ ప్రమాదం…ఇద్దరు ప్రభుత్వ పైలెట్లు మృతి!!

ఛత్తీస్ గఢ్ లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది.

Published By: HashtagU Telugu Desk
chopper crash

chopper crash

ఛత్తీస్ గఢ్ లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మరణించారు. రాయ్ పూర్ లోని స్వామి వివేకానంద ఎయిర్ పోర్టులో గురువారం రాత్రి ప్రభుత్వ హెలికాప్టర్ రన్ వేపై కూలింది. ఈ ప్రమాదంలో పైలెట్లు ఇద్దరు మరణించినట్లు అధికారులు తెలిపారు. పైలెట్లు కెప్టెన్ పాండా, కెప్టెన్ శ్రీవాస్తవగా గుర్తించారు.

వీరిలోఒక్కరు అక్కడిక్కడే మరణించారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలోహెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైంది. టెస్ట్ డ్రైవ్ లో భాగంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించ ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.

రాయ్ పూర్ విమానాశ్రయంలో ప్రభుత్వ హెలికాప్టర్ కూలిపోవడం విచారకరమైన వార్త విన్నాను. ఈఘటనలో ఇద్దరు పైలెట్లు మరణించడం బాధాకారం. వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడుని కోరకుంటున్నాను. ఈ దు:ఖ సమయంలో వారి ఆత్మలకు శాంతి చేకూరాలి. వారి కుటుంబాలకు నా ప్రగాఢసానుభూతి తెలుపుతున్నానంటూ…ట్విట్టర్ ద్వారా తెలిపారు.

  Last Updated: 12 May 2022, 11:35 PM IST